ఉగ్రవాదులు జైలుకు లేదా నరకానికి | Union minister Nityanand Rai on J-K terror attacks | Sakshi
Sakshi News home page

ఉగ్రవాదులు జైలుకు లేదా నరకానికి

Jul 25 2024 6:09 AM | Updated on Jul 25 2024 6:09 AM

Union minister Nityanand Rai on J-K terror attacks

హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్‌ 

న్యూఢిల్లీ: జమ్మూకశీ్మర్‌లో క్రియాశీలకంగా ఉన్న ఉగ్రవాదులు అయితే జైలుకు లేదా నరకానికి వెళతారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్‌ బుధవారం రాజ్యసభలో అన్నారు. మోదీ సర్కారు ఉగ్రవాదాన్ని ఉపేక్షించబోదన్నారు.

 కాంగ్రెస్‌ ఎంపీ ప్రమోద్‌ తివారీ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ఇటీవలి ఉగ్ర అలజడికి  త్వరలో ముగింపు పలుకుతామని, ఉగ్రవాదులు తమ లక్ష్యాలను అందుకోలేరన్నారు. గత కొద్దిరోజుల్లో కశీ్మర్‌లో 28 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టామని చెప్పారు. 

Advertisement
 
Advertisement
Advertisement