పిల్లలపై కరోనా ప్రభావం స్వల్పమే 

Union  Health Ministry Rejected Claim Children Most Affected In 2nd Wave - Sakshi

రెండు వేవ్‌ల్లోనూ బాధితులు 12 శాతం కంటే తక్కువే   

కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి

న్యూఢిల్లీ: రెండో వేవ్‌లో పిల్లలు, యువత అధికంగా ప్రభావితమయ్యారన్న వాదనను కేంద్ర ఆరోగ్య శాఖ తోసిపుచ్చింది. 1 నుంచి 20 ఏళ్లలోపు వారిపై కరోనా వైరస్‌ ప్రభావం చాలా స్వల్పమేనని ప్రకటించింది. ఫస్ట్‌ వేవ్‌ బాధితుల్లో 1–10 వయసు పిల్లలు 3.28 శాతం, సెకండ్‌ వేవ్‌లో 3.05 శాతం మంది ఉన్నారని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్‌ సెక్రెటరీ లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. ఫస్ట్‌ వేవ్‌లో కరోనా సోకినవారిలో 11–20 వయస్కులు 8.03 శాతం, సెకండ్‌ వేవ్‌లో 8.57 శాతం మంది ఉన్నారని వెల్లడించారు.

దేశంలో ప్రస్తుతం కరోనా పాజిటివ్‌ కేసులు భారీగా తగ్గిపోతున్నాయని పేర్కొన్నారు. మే 7న గరిష్ట సంఖ్యలో రోజువా కేసులు నమోదయ్యాయని, ఇప్పుడు 85 శాతం పడిపోయాయని గుర్తుచేశారు.  ఇండియాలో 2020లో జూలై 1 నుంచి డిసెంబర్‌ 31 వరకూ కోవిడ్‌–19 ఫస్ట్‌ వేవ్‌ కొనసాగింది. అప్పుడు మొత్తం బాధితుల్లో 1–20 వయసున్న వారు కేవలం 11.31 శాతం. అలాగే రెండో వేవ్‌ ఈ ఏడాది మార్చి 15 నుంచి మే 25 దాకా ప్రభావం చూపింది.

ఈ 2 నెలల 10 రోజుల్లో కరోనా బారినపడిన వారిలో 1–20 వయస్కులు కేవలం 11.62 శాతం మాత్రమే. కరోనా సోకిన పిల్లలు, యువత సంఖ్య విషయంలో అంటే రెండు వేవ్‌ల మధ్య పెద్దగా వ్యత్యాసం లేదని ప్రభుత్వ గణాంకాలను బట్టి స్పష్టమవుతోంది. ఒకటి, రెండు వేవ్‌ల్లో కలిపి సగటున 11.46 శాతం మంది పిల్లలు, యువత కరోనా బారినపడ్డారు.  


ఫస్ట్‌ వేవ్‌  (2020 జూలై 1 నుంచి డిసెంబర్‌ 31 వరకు)
సెకండ్‌ వేవ్‌ (2021 మార్చి 15 నుంచి మే 25 వరకు) 

చదవండి: ఆర్నెల్లు సమస్యలు వేధిస్తాయి 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top