వైరల్‌: యువతుల బైక్‌ స్టంట్‌.. రూ.28 వేలు ఫైన్

Two Women Bike Stunt Fine 28,000 After Instagram Video Viral - Sakshi

లక్నో: ఏ పని చేసినా వీడియో తీసుకోవటం దాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయటం యువతకు సరదాగా మారిపోయింది. తాను చేసిన వీడియో వల్ల ఆ యువతికి ఫైన్‌ పడింది. సరదాగా చేసిన బైక్‌ స్టంట్‌ వీడియోను సదరు యువతి తన ఇన్‌స్ట్రామ్‌లో పోస్ట్‌ చేసింది. దీంతో ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారి పోలీసుల దృష్టికి వెళ్లింది. ట్రాఫిక్‌ నింబంధనలు ఉల్లంఘించిన సదరు యువతికి పోలీసులు రూ.28 వేల ఫైన్‌ వేశారు. ఈ ఘటన ఉత్తప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. శివంగి దబాస్, రెజ్లర్ స్నేహ రఘువంషి ఇద్దరు స్నేహితులు. అయితే శనివారం ఘజియాబాద్‌ రోడ్డుపై స్నేహి రఘువంషి తన స్నేహితురాలు శివంగి దబాస్‌ను భుజాలపై కూర్చుబెట్టుకొని బైక్‌ను నడిపింది.

ఈ బైక్‌ స్టంట్‌కు సంబంధించిన వీడియోను రఘువంషి తన ఇన్‌స్టాగ్రామ్‌లో‌ పోస్ట్ ‌చేయడంతో ఆ వీడియో వైరల్‌ అయింది. ఆ వీడియో పోలీసుల కంటపడటంతో రఘువంషి తల్లి మంజూ దేవికి రూ.11వేల చలానా పంపారు. అదే విధంగా ఆ బైక్‌ యజమాని అయిన సంజయ్‌ కుమార్‌కు రూ.17వేల ఫైన్‌ వేశారు. ఈ ఇద్దరు యువతలకు డ్రైవింగ్‌ లైసన్స్‌ కూడా లేదని పోలీసులు తెలిపారు.

డ్రైవింగ్‌ లైసన్స్‌ లేకుండా ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తూ అనుమతి లేకుండా రోడ్డుపై స్టంట్‌ చేసినందుకు చలానా పంపి, ఫైన్‌ వేశామని ఘజియాబాద్‌ ట్రాఫిక్‌ ఎస్పీ రామానంద్ కుష్వాహా తెలిపారు. వాళ్లు నడిపిన బైక్‌కు నంబర్‌ ప్లేట్‌ కూడా లేదని ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. దీనిపై రఘువంషి మాట్లాడుతూ.. తాము స్టంట్‌ ప్రాక్టిస్‌ చేయటం కోసం జనాలు ఎక్కువ లేని రోడ్డును ఎంచుకున్నాం. కేవలం సరదాగా ఆ వీడియో తీశామని, ఆ వీడియో ఇంత పెద్ద వివాదంగా మారుతుందని ఊహించలేదని తెలిపారు.

చదవండి: వైరల్‌: హీరో డ్యాన్స్‌‌.. అచ్చం అంపైరింగ్‌‌లా!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top