ట్రాక్‌మ్యాన్‌ సమయస్ఫూర్తి.. రైలుకు తప్పిన పెను ప్రమాదం | Trackman Hero: Mahadeva Stops Major Train Accident | Sakshi
Sakshi News home page

ట్రాక్‌మ్యాన్‌ సమయస్ఫూర్తి.. రైలుకు తప్పిన పెను ప్రమాదం

Sep 7 2024 8:50 PM | Updated on Sep 8 2024 12:58 PM

Trackman Hero: Mahadeva Stops Major Train Accident

న్యూఢిల్లీ: ట్రాక్‌మ్యాన్‌ సమయస్ఫూర్తి వల్ల పెద్ద రైలు ప్రమాదం తప్పింది. కొంకణ్‌ రైల్వే డివిజన్‌ పరిధిలోని కుమటా, హొన్నావర్ మధ్య రైల్వే లైన్‌లో పట్టాల మధ్య వెల్డింగ్‌ తొలగిపోయింది. శుక్రవారం విధుల్లో ఉన్న ట్రాక్‌మ్యాన్‌ మహదేవ్‌.. ట్రాక్‌ జాయింట్‌లో వెల్డింగ్‌ పోయి ఉండటాన్ని గమనించాడు.

అయితే అదే మార్గంలో  తిరువనంతపురం-ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌ వస్తుండటాన్నిఆపడానికి మహదేవ్‌ తీవ్ర ప్రయత్నాలు చేశారు. చివరగా పట్టాల వెంట పరుగులు తీయడంతో గమనించిన లోకో పైలట్‌ రైలును నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు.. అతడి సమయస్ఫూర్తిని అభినందించారు. నగదు బహుమతి అందిచారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement