సైకిల్‌కు టోల్‌ ఫీజా ? | Toll Row Erupts In Bengaluru After Cyclist Charged Toll On NICE Road, Video Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

సైకిల్‌కు టోల్‌ ఫీజా ?

Apr 23 2026 10:05 AM | Updated on Apr 23 2026 11:11 AM

Toll row erupts in Bengaluru after cyclist video goes viral

దొడ్డబళ్లాపురం: దేశ వ్యాప్తంగా ఉన్న టోల్‌గేట్‌లలో ద్విచక్ర వాహనాలు, సైకిళ్లకు ఎటువంటి ఫీజులు వసూలు చేయరనేది అందిరికీ తెలిసిందే. అయితే నైస్‌ రోడ్డులో సైకిల్‌కి రూ.25 టోల్‌ ఫీజు చెల్లించిన ఉత్తర భారత దేశానికి చెందిన వ్యక్తి వీడియో తీస్తూ తన బాధ చెప్పుకున్నాడు. తాను దేశంలో ఎన్నో రాష్ట్రాలు దాటి సైకిల్‌ మీద వస్తున్నానని, అయితే తన సైకిల్‌కి ఎక్కడా టోల్‌ వసూలు చేయలేదన్నారు. మొట్టమొదటి సారి కర్ణాటకలోని బెంగళూరు సమీపంలోని నైస్‌ రోడ్డులో రూ.25లు వసూలు చేశారని, ఇది ట్యాక్సా లేక పగటి దోపిడీనా అంటూ ప్రశ్నించాడు. ఈడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

 

 

Advertisement
 
Advertisement
Advertisement