టాప్‌ న్యూస్‌.. నేటి విశేషాలు | Today Top News 8th December 2020 | Sakshi
Sakshi News home page

టాప్‌ న్యూస్‌.. నేటి విశేషాలు

Dec 8 2020 6:22 PM | Updated on Dec 8 2020 6:49 PM

Today Top News 8th December 2020 - Sakshi

విజయవంతంగా ముగిసిన భారత్ బంద్
భారత్‌ బంద్‌ విజయవంతంగా ముగిసింది. రైతులకు వివిధ రాజకీయ పార్టీలు మద్దతుగా నిలిచాయి. తెలంగాణలోనూ బంద్‌ విజయవంతంగా సాగింది. పూర్తి వివరాలు..

భారత్‌ బంద్‌ ఎఫెక్ట్‌.. రంగంలోకి అమిత్‌ షా
భారత్‌ బంద్‌ ఎఫెక్ట్‌తో కేంద్ర హోమంత్రి అమిత్‌ షా రంగంలోకి దిగారు. రైతు సంఘాల నేతలతో చర్చించేందుకు సిద్ధమయ్యారు. పూర్తి వివరాలు..  

సమగ్ర భూ సర్వేతో ప్రజలకు మేలు
సమగ్ర సర్వేపై తప్పుడు ఆలోచనలు కలిగించేలా ప్రతిపక్ష పార్టీకి చెందిన పత్రికలు ప్రచారం చేస్తున్నాయని.. సర్వే వల్ల కలిగే ప్రయోజనాలేంటో ప్రజలకు చెప్పాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. పూర్తి వివరాలు..

ఎవరెస్ట్‌ ఎత్తు పెరిగింది
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్ట్‌ ఎత్తును నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది. పూర్తి వివరాలు.. 

ఏలూరు బాధితులకు వైద్య పరీక్షలపై సీఎం ఆరా
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అస్వస్థతకు గురైన వారికి నిర్వహిస్తున్న పరీక్షలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు. పూర్తి వివరాలు..

కృత్రిమ సూర్యుడిని తయారు చేసిన చైనా
సృష్టికి ప్రతిసృష్టి అన్నట్టుగా తాజాగా కృత్రిమ సూర్యుడిని తయారు చేసింది చైనా. పూర్తి వివరాలు..  

పోరాడి ఓడిన టీమిండియా
ఆసీస్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా చివరివరకు పోరాడి ఓడిపోయింది.187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 20 ఓవర్లలో 174 పరుగులు మాత్రమే చేయగలిగింది.  పూర్తి వివరాలు..

మళ్లీ రగులుకున్న ‘ఈశాన్యం’
అస్సాం, త్రిపుర, ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో మళ్లీ అగ్గి రాజుకుంది. ఏడాది క్రితం డిసెంబర్‌ 11, 2019లో పార్లమెంట్‌ ఆమోదించిన పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. పూర్తి వివరాలు..

ఈ యాప్స్ ని వెంటనే డిలీట్ చేయండి
బంబుల్, ఓక్‌కుపిడ్, గ్రైండర్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, సిస్కో టీమ్స్, వైబర్ వంటి ప్రముఖ డేటింగ్‌, ట్రావెల్‌, వీడియో కాలింగ్ యాప్స్ లలో ఇటీవల ఒక పెద్ద బగ్ గుర్తించినట్లు చెక్‌పాయింట్ పరిశోధకులు తెలిపారు. పూర్తి వివరాలు..

వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై స్టే పొడిగింపు
ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై స్టే ఈ నెల 10 వరకు తెలంగాణ హైకోర్టు పొడిగించింది. పూర్తి వివరాలు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement