
యడియూరప్పకు పదవీ గండం తప్పదా?
కేంద్ర హోం మంత్రి అమిత్ షా గతవారం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పర్యటించినప్పుడు పలువురు తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. పలు రాష్ట్రాలకు బీజేపీ విస్తరిస్తోన్న నేపథ్యంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు సన్నగిల్లుతోన్న నేపథ్యంలో ఈ పార్టీ ఫిరాయింపు రాజకీయాలు చోటు చేసుకున్నాయి. పూర్తి వివరాలు..
ఏపీలో మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం
మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. వైఎస్సార్– జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకాన్ని సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ సరిహద్దు గ్రామం జగ్గయ్యపేట మండలంలోని తక్కెళ్లపాడులో సరిహద్దు రాయిను పాతి భూ రీసర్వేకు శ్రీకారం చుట్టారు. పూర్తి వివరాలు..
సీఎం జగన్ బర్త్ డే: కేట్ కట్ చేయించిన సీఎస్, డీజీపీ
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు సందర్బంగా సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తదితరులు సీఎం నివాసంలో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. పూర్తి వివరాలు..
వైఎస్సార్ సీపీ శ్రేణుల రక్తదానం: గిన్నిస్ రికార్డు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజును పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ శ్రేణుల రక్తదాన శిబిరాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రక్తదాన కార్యక్రమం అత్యంత అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. పూర్తి వివరాలు..
‘న్యూయార్క్‌తో పోల్చితే హైదరాబాద్‌లో మర్డర్స్ తక్కువ’
ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో సోమవారం క్రైం వార్షిక ప్రెస్‌మీట్ నిర్వహించారు. గతేడాదితో పోల్చితే హైదరాబాద్ సీపీ పరిధిలో క్రైమ్ రేటు 10 శాతం తగ్గినట్లు సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. పూర్తి వివరాలు..
ధరణి ఆస్తుల నమోదుపై హైకోర్టులో విచారణ
ధరణిలో ఆస్తుల నమోదుపై హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. నవంబరు 3న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేయాలని తెలంగాణ ప్రభుత్వం వెకేట్ పిటిషన్ దాఖలు చేసింది. పూర్తి వివరాలు..
కొత్త కరోనా వైరస్.. బ్రిటన్ నుంచి విమానాలు రద్దు!
కరోనా వైరస్ తిప్పలు ప్రజలకు ఇంకా తప్పడం లేదు. ఇప్పటివరకూ ఉన్న కరోనా వైరస్ వల్ల సంవత్సర కాలంలో 7 కోట్ల మందికి పైగా వ్యాధి బారిన పడ్డారు. ఏడాదిగా పీడిస్తున్న ఈ మహమ్మారి తలలు వంచేందుకు ఇప్పటికీ సరైన వ్యాక్సిన్ జనజీవనంలోకి అడుగుపెట్టలేదు. పూర్తి వివరాలు..
మార్కెట్లను ముంచిన కరోనా సునామీ
ఏడాది కాలంగా ప్రపంచాన్ని వణికిస్తున్నకరోనా వైరస్ తాజాగా రూపు మార్చుకుని సునామీ సృష్టిస్తోంది. బ్రిటన్‌లో వెలుగుచూసిన ఈ వైరస్ కారణంగా దేశ, విదేశీ మార్కెట్లో బంగారం ధరలు భగ్గుమంటే.. దేశీయంగా స్టాక్స్‌లో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో సెన్సెక్స్ ఏకంగా 1,407 పాయింట్లు కుప్పకూలింది. పూర్తి వివరాలు..
అర్జున్ ఇచ్చిన డాక్టర్ ప్రిస్క్రిప్షన్ నకిలీదని తేలితే..
బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహరంలో నటుడు అర్జున్ రాంపాల్‌కు ఇటీవల ఎన్‌సీబీ మరోసారి సమన్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. తదుపురి విచారణకు అర్జున్ హజరవ్వాల్సిందిగా ఎన్‌సీబీ ఆదేశించింది. ఈ నేపథ్యంలో అర్జున్ సోమవారం మధ్యాహ్నం ఎన్‌సీబీ ఎదుట హజరయ్యాడు. పూర్తి వివరాలు..
అదే టీమిండియా కొంపముంచింది..
ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇక్కడ జరిగిన పింక్ బాల్ టెస్టులో టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఫర్వాలేదనిపించిన కోహ్లి గ్యాంగ్.. రెండో ఇన్నింగ్స్‌లో పూర్తిగా తేలిపోయింది. పూర్తి వివరాలు..