టాప్‌-10 వార్తా విశేషాలు..

Today Telugu News Headlines 18th December 2020 - Sakshi

చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలి
ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డేను ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫు సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌భూషణ్‌ అభ్యర్థించారు.  పూర్తి వివరాలు.. 

ముందే వచ్చిన సంక్రాంతి

బీసీ కార్పొరేషన్ల చైర్‌పర్సన్లు, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సందడి చూస్తుంటే సంక్రాంతి పండుగ నెల రోజులు ముందే వచ్చినట్లుగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 56 బీసీ కార్పొరేషన్లకు పాలకవర్గాల ప్రమాణ స్వీకారోత్సవాన్ని గురువారం విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియంలో నిర్వహించారు. పూర్తి వివరాలు..

ఆధార్‌ అడగొద్దు.. కులం వివరాలు కోరొద్దు

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు స్లాట్‌ బుక్‌ చేసుకునే సమయంలో ఆధార్, కులం వివరాలను అడగడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఆస్తులు అమ్మే, కొనేవారి ఆధార్‌ నంబర్లు, కులంతోపాటు కుటుంబ సభ్యుల వివరాలు, సామాజిక హోదా, సాక్షుల ఆధార్‌ నంబర్లను కోరడంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. పూర్తి వివరాలు.. 

జనవరి 27న విడుదలకానున్న చిన్నమ్మ..!  

జైలు జీవితాన్ని వీడి బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టేందుకు శశికళ మార్గం సుగమమైనట్లు విశ్వసనీయ సమాచారం. ఆమె వచ్చే ఏడాది జనవరి 27న విడుదల కానున్నారు. విడుదల సమయంలో చేపట్టాల్సిన బందోబస్తు చర్యలపై కర్ణాటక ప్రభుత్వం గురువారం జారీ చేసిన సర్క్యులర్‌ చిన్నమ్మ విడుదల విషయాన్ని అనధికారికంగా ధ్రువీకరించింది.  పూర్తి వివరాలు.. 

‘గులాబీ’ గుచ్చుకుంది.. 

పింక్‌ పోరులో టీమిండియా తడబడింది. ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టెస్ట్‌లో టాస్‌ నెగ్గి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 89 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. కోహ్లి (180 బంతుల్లో 74; 8 ఫోర్లు) భారత ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచాడు. పూర్తి వివరాలు.. 

చట్టాలకు బ్రేకులేయండి

అహింసాయుతంగా నిరసన తెలిపే హక్కు రైతులకు ఉందని సుప్రీంకోర్టు గురువారం ఉద్ఘాటించింది. రైతు సమస్యల పరిష్కారానికి వ్యవసాయ నిపుణులు, రైతు సంఘాలతో ‘నిష్పాక్షిక, స్వతంత్ర’ కమిటీని ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో.. మూడు కొత్త వ్యవసాయ చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. పూర్తి వివరాలు.. 

నిరాడంబరంగా బైడెన్‌ ప్రమాణం

జనవరి 20న అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్‌ బాధ్యతలు స్వీకరించే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కోవిడ్‌–19 ముప్పు నేపథ్యంలో నిరాడంబరంగా జరపాలని భావిస్తున్నారు. ఎంపిక చేసిన కొద్దిమంది సమక్షంలోనే అధ్యక్షుడిగా బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్‌ ప్రమాణ స్వీకారం చేస్తారని జాయింట్‌ కాంగ్రెషనల్‌ కమిటీ ఆన్‌ ఇనాగరల్‌ సెరిమనీస్‌(జేసీసీఐసీ) వెల్లడించింది. పూర్తి వివరాలు.. 

భారత్, బంగ్లా మధ్య ఏడు ఒప్పందాలు
భారత్, బంగ్లాదేశ్‌ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడనున్నాయి. మొత్తం ఏడు రంగాల్లో పరస్పర సహకారం కోసం ఇరుపక్షాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ప్రధాని మోదీ, బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా మధ్య గురువారం జరిగిన ఆన్‌లైన్‌ సదస్సులో ఈ మేరకు ఒప్పందాలు కుదిరాయి. పూర్తి వివరాలు.. 

మరిన్ని భాషల్లో గూగుల్ సేవలు
దేశీయంగా వినియోగదారులకు చేరువయ్యేందుకు టెక్‌ దిగ్గజం గూగుల్‌ మరింత దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా స్థానిక భాషల్లో సెర్చ్‌ సేవలపై మరింత దృష్టి పెట్టనుంది. పూర్తి వివరాలు.. 

నవ్వులకు క్లాప్‌
వెంకటేశ్, వరుణ్‌తేజ్, తమన్నా, మెహరీన్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘ఎఫ్‌3’. గతేడాది సంక్రాంతికి విడుదలై ఘనవిజయం సాధించిన ‘ఎఫ్‌2’కి ఇది సీక్వెల్‌. గురువారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ‘ఎఫ్‌3’ని ప్రారంభించారు. పూర్తి వివరాలు.. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top