టుడే‌ హెడ్‌లైన్స్‌; ఆసక్తికర విశేషాలు | Today News Headlines 14th December 2020 | Sakshi
Sakshi News home page

టాప్‌ న్యూస్‌; ఆసక్తికర వార్తలు

Dec 14 2020 8:18 AM | Updated on Dec 14 2020 1:19 PM

Today News Headlines 14th December 2020 - Sakshi

దేవాలయాలు కూల్చిన దుర్మార్గుడు బాబు
అధికారంలో ఉండగా విజయవాడలో 40 ఆలయాలకు పైగా కూల్చేసిన దుర్మార్గుడు చంద్రబాబని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు విమర్శించారు. మత రాజకీయాలు చేసే చంద్రబాబు నిద్రలేచినప్పుడల్లా తాను హిందువునని ప్రకటించుకునే ప్రయత్నం చేస్తుంటారని ఎద్దేవా చేశారు. పూర్తి వివరాలు

గిరిజనుల హక్కులు కాలరాసిన చంద్రబాబు
గిరిజన సంక్షేమంపై మాట్లాడే అర్హత టీడీపీ నేత చంద్రబాబుకు లేదని డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు. గిరిజనులను చంద్రబాబు అంటరాని వారిగా చూసి కేబినెట్‌లో కూడా అవకాశం ఇవ్వలేదని మండిపడ్డారు. పూర్తి వివరాలు

ఉత్కంఠ రేపుతున్న పీసీసీ చీఫ్‌ ఎంపిక
తెలంగాణ పీపీసీ కొత్త అధ్యక్షుడి ఎంపిక వ్యవహారం రాష్ట్ర కాంగ్రెస్‌లో కాక రేపుతోంది. బంతి అధిష్టానం కోర్టుకు చేరడంతో సీన్‌ ఢిల్లీకి మారుతోంది. అభిప్రాయ సేకరణపై సోనియాకు ఫిర్యాదు చేయాలని పలువురు నేతలు భావిస్తున్నట్టు సమాచారం. పూర్తి వివరాలు

పోరాటం ముగియలేదు: ట్రంప్‌
అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై తన పోరాటం ఇంకా ముగియలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి స్పష్టం చేశారు. స్వింగ్‌ స్టేట్స్‌లో అక్రమాలకు సంబంధించి ట్రంప్‌ తరఫున వేసిన ఒక వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తాజాగా కొట్టివేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తివివరాలు



► 
తొలి దశలో కోటి మందికి టీకా
కేంద్రం నుంచి రాష్ట్రానికి కోవిడ్‌ వ్యాక్సిన్‌ (టీకా) రాగానే నెలలో కోటిమందికి వేసేలా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కేంద్రం పంపే డోసుల్ని బట్టి ఎంతమందికి వస్తే అంతమందికి టీకా వేస్తారు. పూర్తి వివరాలు..

ఏలూరు బాధితులకు అండగా ప్రభుత్వం
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అంతుచిక్కని వ్యాధితో అనారోగ్యం బారిన పడిన బాధితులకు ప్రభుత్వం అండగా నిలిచింది. 650 బాధిత కుటుంబాలకు వలంటీర్లు, సచివాలయ సిబ్బంది ద్వారా నిత్యావసరాలు పంపిణీ చేసింది. పూర్తి వివరాలు

► ఆ ఏడు ప్రాజెక్టులు ఆపండి..
కేంద్ర జల్‌శక్తి శాఖ తాజాగా తెలంగాణకు ఓ లేఖ రాసింది. అదిప్పుడు చర్చనీయాంశమైంది. ఇంతకీ ఆ లేఖలో ఏం ఉందంటే? కాళేశ్వరం ఎత్తిపోతల మూడో టీఎంసీ ప్రతిపాదిత ప్రాజెక్టుసహా ఏడు ప్రాజెక్టులు కొత్త ప్రాజెక్టుల నిర్వచనం పరిధిలోకి వస్తున్నందున వాటిపై ముందుకు వెళ్లొద్దని పేర్కొంది. పూర్తి వివరాలు..


అమెరికాలో గాంధీ విగ్రహానికి అవమానం 
అమెరికాలోని వాషింగ్టన్‌లో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి కొందరు ఖలిస్తానీ వేర్పాటు వాదులు విఫల యత్నం చేశారు.
పూర్తి వివరాలు..

ఐటీ రిటర్నుల దాఖలుకు మార్గాలివే..
ఆదాయపన్ను రిటర్నుల (ఐటీఆర్‌) దాఖలుకు మరో రెండు వారాల వ్యవధే మిగిలి ఉంది. 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటర్నుల దాఖలు గడువు వాస్తవానికి జూలైతోనే ముగియాలి. పూర్తి వివరాలు..



► ఎస్పీబీ పేరిట ప్రత్యేకమైన పార్కు
గాన గంధర్వుడు ఎస్‌.పి. బాలసుబ్రహ్మణ్యం పేరుతో తమిళనాడులోని కోయంబత్తూరులో ఓ ప్రత్యేకమైన పార్కు ఏర్పాటైంది. ‘సిరు తుళి’  అనే స్వచ్ఛంద సేవా సంస్థ ‘ఎస్‌.పి.బి. వనం’ పేరిట ఈ పార్కును ఏర్పాటు చేసింది. పూర్తి వివరాలు..


► ప్రాక్టీస్‌ ప్రతిఫలం మనకే
ఆఖరి ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో ఆఖరి రోజు ఆస్ట్రేలియన్‌ బ్యాట్స్‌మెన్‌ శతక్కొట్టి ఉండవచ్చు... తుదకు మ్యాచ్‌ ‘డ్రా’ అయిండొచ్చు... కానీ ఓవరాల్‌గా బోలెడు లాభాలు ఒరిగింది మాత్రం కచ్చితంగా టీమిండియాకే. పూర్తి వివరాలు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement