షాకింగ్ ఘటన:రెస్టారెంట్‌లోకి దూసుకొచ్చిన టెంపో..ముగ్గురికి గాయాలు

Tempo Crashes Into Dhaba In Surat 3 Seriously Injured At Gujarat - Sakshi

గుజరాత్‌లోని సూరత్‌లో ఘోర ‍ప్రమాదం సంభవించింది. అకస్మాత్తుగా ఒక టెంపో హైవేకి సమీపంలో ఉన్న ధాబా (రోడ్డు సైడ్‌ రెస్టారెంట్‌)లోకి దూసుకొచ్చింది. సరిగ్గా ఆ సమయంలో రెస్టారెంట్‌లో సుమారు 8 నుంచి 10 మంది దాక కస్టమర్లు ఉన్నారు. ఈ అనుహ్య ఘటనలో ముగ్గరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ టెంపో అదుపు తప్పి వేగంగా ధాభాలోకి దూసుకురావడంతో రెస్టారెంట్‌లోని గోడను ఢీకొట్టి ఫర్నీచర్‌ని ధ్వంసం చేస్తూ..పలువురు పైకి దూసుకుపోయింది.

ఈ ఘటన జరిగిన వెంటనే డ్రైవర్‌ అక్కడ నుంచి పరారయ్యాడు. అందుకు సంబంధించిన ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డు అవ్వడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఐతే ఆ సమయంలో టెంపో ఖాళీగానే ఉందని డ్రైవర్‌ మాత్రం తప్పించుకున్నాడని అధికారులు చెబుతున్నారు.  ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

(చదవండి: గుంజీలు తీయండి..ఫ్రీగా బస్సు టిక్కెట్‌ పొందండి)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top