
సాక్షి,న్యూఢిల్లీ: ఏపీ సీఐడీకి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. రాజ్ కేసిరెడ్డి అరెస్ట్‌పై దాఖలైన పిటిషన్‌పై సీఐడీకి నోటీసులు పంపించింది. రాజ్ కసిరెడ్డి అరెస్టు అక్రమమని దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ జేబీ పార్థి వాలా, జస్టిస్ మహదేవన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. రాజ్ కేసిరెడ్డి తరఫున సీనియర్ న్యాయవాదులు మహేష్ జెఠ్మలానీ , పొన్నవలు సుధాకర్ రెడ్డి, అల్లంకి రమేష్‌లు వాదనలు వినిపించారు.
ఇరుపక్షాల వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం తదుపరి విచారణ మే 19కి వాయిదా వేసింది. వాదనలు విన్న అనంతరం ఏపీ సీఐడీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేస్తూ నిర్ణయం తీసుకుంది.