Sonali Phogat: మరణానికి ముందు సోనాలి ఫోగట్‌కు డ్రగ్స్‌! .. సంచలన విషయాలు వెల్లడి

Sonali Phogat Was Drugged At Party Says Goa Police - Sakshi

బీజేపీ నేత, నటి సోనాలి ఫోగట్‌ అనుమానాస్పద మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సోనాలి ఫోగట్​ ఆగస్టు 23న గోవాలో హఠాన్మరణ చెందిన విషయం తెలిసిందే. తొలుత గుండెపోటుతో మరణించినట్లు భావించగా.. తరువాత సోనాలిది హత్యేనని ఆమె కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలతో గోవా పోలీసులు మర్డర్‌ కేసు నమోదు చేశారు. తాజాగా ఆమె డెత్‌ మిస్టరీలో మరో ట్విస్ట్‌ నెలకొంది. సోనాలికి పార్టీలో డ్రగ్స్‌ ఇచ్చినట్లు తేలింది. అదే ఆమె మరణానికి దారితీసిందని గోవా పోలీసులు వెల్లడించారు. 

ఈ మేరకు గోవా ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ (ఐజీ) ఓంవీర్‌ సింగ్‌ బిష్ణోయ్‌ శుక్రవారం మీడియాకు సంచలన విషయాలు వెల్లడించారు. సోనాలి ఫోగట్ మరణానికి ముందు అంజునాలో జరిగిన పార్టీలో ఆమెకు తన ఇద్దరు సహచరులు మత్తుమందు ఇచ్చినట్లు తేలిందన్నారు. అసహ్యకరమైన రసాయన పదార్ధాలను కలిపిన డ్రింక్‌ను ఆమెతో బలవంతంగా తాగించారని పేర్కొన్నారు.
చదవండి: బీజేపీ నేత సోనాలి ఫోగట్‌ మృతదేహంపై గాయాలు.. హత్య​ కేసు న‌మోదు

డ్రింక్‌ తాగిన తర్వాత ఆమె తనపై తాను కంట్రోల్‌ తప్పిందని తెలిపారు. సోనాలి నియంత్రణ కోల్పోవడంతో ఉదయం 4.30 నిమిషాలకు తనను టాయిలెట్‌లకు తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. అయితే తరువాత రెండు గంటలపాటు ఏం చేశారనే దానిపై వివరణ లేదన్నారు. నిందితులిద్దరూ ఆమె హత్యకు సంబంధించిన కేసులో ఇప్పుడు ప్రధాన నిందితులుగా ఉన్నట్లు పేర్కొన్నారు. వీరిద్దరూ ఆగస్టు 22న ఫోగట్‌తో కలిసి గోవాకు వెళ్లారని, అంజునాలోని కర్లీస్ రెస్టారెంట్‌లో పార్టీ చేసుకున్నారని తెలిపారు. ప్రస్తుతం వీరిని అరెస్ట్‌ చేసినట్లు, త్వరలోనే కోర్టులో హాజరు పరుస్తామని వెల్లడించారు. ఇక డ్రగ్స్‌ ప్రభావంతోనే సోనాలి మృతి చెందినట్లు తెలుస్తుందన్నారు.
చదవండి: సోనాల్‌ ఫోగట్‌ మృతిలో మరో ట్విస్ట్‌.. నైట్‌ క్లబ్‌ వీడియో వైరల్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top