కోవిషీల్డ్‌కు పూర్తిస్థాయి అనుమతులివ్వండి

Serum Institute of India seeks regular marketing authorisation from DCGI for Covishield - Sakshi

డీసీజీఐకి సీరమ్‌ దరఖాస్తు

న్యూఢిల్లీ: భారత్‌తో పాటు పలు దేశాల్లో 100 కోట్లకు పైగా డోసుల పంపిణీ జరిగినందువల్ల కోవిషీల్డ్‌కు పూర్తిస్థాయి వ్యాపార అనుమతి మంజూరు చేయాలని తయారీ సంస్థ సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆప్‌ ఇండియా (సీఐఐ) డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ)కి దరఖాస్తు చేసింది. భారత్‌లో వినియోగిస్తున్న కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్‌లకు అత్యవసర వినియోగ అనుమతులు మాత్రమే ఉన్న విషయం తెలిసిందే. ఫేజ్‌ 3 క్లినికల్‌ ట్రయల్స్‌ ఫలితాలను ఇదివరకే సమర్పించామని, ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా కోవిషీల్డ్‌ టీకాల పంపిణీ జరిగిందని, వైరస్‌ నుంచి రక్షణ కల్పిస్తోందని, వ్యాక్సిన్‌ సమర్థతకు ఇదే నిదర్శనమని సీరమ్‌ పేర్కొంది.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top