ప్రధానిపై కథనం..సంజయ్‌ రౌత్‌పై కేసు | Sakshi
Sakshi News home page

ప్రధానిపై కథనం..సంజయ్‌ రౌత్‌పై కేసు

Published Tue, Dec 12 2023 7:52 AM

Sedition Case Filed Against Sanjay Raut In Maharashtra - Sakshi

ముంబై: శివసేన(ఉద్ధవ్‌)నేత,రాజ్యసభ ఎంపీ సంజయ్‌రౌత్‌పై మహారాష్ట్రలోని యావత్మాల్‌ పోలిస్‌స్టేషన్‌లో రాజద్రోహం కేసు నమోదైంది. ప్రధాని మోదీపై పార్టీ పత్రిక సామ్నాలో అభ్యంతరకర ఆర్టికల్‌ రాశారన్న కారణంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.

యావత్మాల్‌ బీజేపీ కన్వీనర్‌ నితిన్‌ భుటాడా ఫిర్యాదు మేరకు రౌత్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. సోమవారం(డిసెంబర్‌11)న రౌత్‌ సామ్నాలో ప్రధానిపై అభ్యంతరకర ఆర్టికల్‌ రాశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

పార్టీ పత్రిక సామ్నాకు రౌత్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. రౌత్‌పై రాజద్రోహం(ఐపీసీ 124ఏ)తో పాటు రెండు వర్గాల మధ్య విద్వేషాలు రేపేందుకు ప్రయత్నించారని ఐపీసీ153(ఏ) సెక్షన్‌ కింద ఆయనపై కేసు నమోదు చేశారు.  

ఇదీచదవండి..యాదవ్‌కు సీఎం పదవి..బీజేపీ బిగ్‌ స్కెచ్‌

Advertisement
 
Advertisement