ఐటీ దాడుల్లో రూ.750 కోట్ల అక్రమాస్తులు బహిర్గతం

Rs 750 Crore Scams Exposed in IT Raids Bangalore - Sakshi

సాక్షి, బనశంకరి: బెంగళూరులో నాలుగురోజుల కిందట కాంట్రాక్టర్లు, చార్టెడ్‌ అకౌంటెంట్, తదితరుల ఇళ్లపై జరిగిన సోదాల వివరాలను ఐటీ అధికారులు మీడియాకు వెల్లడించారు. ముగ్గురు ప్రముఖ కాంట్రాక్టర్లు, 40 మంది సబ్‌ కాంట్రాక్టర్ల పేర్లతో నీటి ప్రాజెక్టుల పనుల్లో అక్రమాలకు పాల్పడ్డారని తెలిపారు.

ఈ సోదాల్లో రూ.750 కోట్ల విలువైన అక్రమాస్తుల వివరాలు వెల్లడయ్యాయి. ఈ మొత్తంలో రూ.487 కోట్లకు సరైన ఆధారాలు లేవని తేల్చారు. పలువురి ఇళ్లలో రూ.8.67 కోట్ల విలువైన బంగారం, రూ.29.83 కోట్ల విలువైన వెండిని సీజ్‌చేశారు. దాడి సమయంలో మొత్తం రూ.4.69 కోట్ల నగదు సీజ్‌ చేశారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top