Rahul Gandhi On Agnipath: అగ్నిపథ్‌పై ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ కౌంటర్

అగ్నిపథ్ స్కీమ్‌పై దేశవ్యాప్తంగా విమర‍్శలు వెలువెత్తుతున్నాయి. ఈ పథకానికి వ్యతిరేకంగా అభ్యర్థులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. మోదీ సర్కార్‌పై మండిపడ్డారు.
అగ్నిపథ్‌పై రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. త్రివిధ దళాల్లో నియామకాల కోసం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ 'మాఫీవీర్'గా మారి.. యువత డిమాండ్‌కు తలొగ్గుతారు. గత ఎనిమిదేళ్ల నుంచి బీజేపీ ప్రభుత్వం 'జై జవాన్, జై కిసాన్' విలువలను అవమానపరిచింది. సాగు చట్టాలను ప్రధానమంత్రి రద్దు చేసుకోకతప్పదని నేను గతంలో చెప్పాను. అదే తరహాలో తాజాగా ఆయన దేశ యువత నిర్ణయాన్నీ అంగీకరించాల్సిందే. క్షమాపణలు చెప్పి అగ్నిపథ్‌ను వెనక్కి తీసుకోవాల్సిందే" అని పోస్టులో పేర్కొన్నారు.
రైతుల సుదీర్ఘ నిరసనల అనంతరం సాగు చట్టాలను ఎలా రద్దు చేశారో.. అలాగే సైనికుల నియామకాల కోసం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని సైతం వెనక్కి తీసుకోక తప్పదని కౌంటర్ ఇచ్చారు. మరోవైపు.. అగ్నిపథ్‌కు వ‍్యతిరేకంగా ఆందోళనలు చేపట్టేందుకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఆదివారం(జూన్ 19వ తేదీన) ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర నిరసన తెలపాలని నిర్ణయం తీసుకున్నట్లు రాహుల్ గాంధీ తెలిపారు. నిరసనలు చేపడుతున్న యువకులకు సంఘీభావంగా కాంగ్రెస్ నేతలు సత్యాగ్రహం చేయనున్నట్టు తెలిపారు.
8 सालों से लगातार भाजपा सरकार ने ‘जय जवान, जय किसान' के मूल्यों का अपमान किया है।
मैंने पहले भी कहा था कि प्रधानमंत्री जी को काले कृषि कानून वापस लेने पड़ेंगे।
ठीक उसी तरह उन्हें ‘माफ़ीवीर' बनकर देश के युवाओं की बात माननी पड़ेगी और 'अग्निपथ' को वापस लेना ही पड़ेगा।
— Rahul Gandhi (@RahulGandhi) June 18, 2022
ఇది కూడా చదవండి: అగ్నిపథ్ ఆందోళనలు.. కేంద్ర హోం శాఖ సంచలన నిర్ణయం