కేంద్రం చేతగానితనం వల్లే నిరుద్యోగం: రాహుల్‌ | Rahul Gandhi Criticized Central Government Creating Unemployment | Sakshi
Sakshi News home page

కేంద్రం చేతగానితనం వల్లే నిరుద్యోగం: రాహుల్‌

Feb 13 2022 7:33 AM | Updated on Feb 13 2022 7:33 AM

Rahul Gandhi Criticized Central Government Creating Unemployment - Sakshi

న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేతగానితనం వల్ల దేశంలో నిరుద్యోగ ఎమర్జెన్సీ నెలకొందని కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ విమర్శించారు. పెచ్చరిల్లిన నిరుద్యోగం వల్లే యువత ఆత్మహత్యలు పెరుగుతున్నాయంటూ శనివారం ట్వీట్‌ చేశారు. 2018–20 మధ్య అప్పుడు, నిరుద్యోగం వల్ల దేశవ్యాప్తంగా 25 వేల మంది ఆత్మహత్య చేసుకున్నారన్న మీడియా నివేదికను ఆయన ఉదాహరించారు. నిరుద్యోగం వల్ల ఆత్మహత్యలు 24 శాతం పెరిగాయంటూ రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే కూడా ట్వీట్‌ చేశారు. ‘‘84 శాతం కుటుంబాల ఆదాయం తగ్గిపోయింది. అయినా ప్రధాని మోదీ, ఆయన మంత్రులు తమ పాలనను అమృత కాలమని చెప్పుకుంటున్నారు. నిజానికి గుడ్డి రాజు పాలన సాగుతున్న అంధకాలమిది’’ అంటూ విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement