యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థి ఎవరు?... క్లూ ఇచ్చిన ప్రియాంక! | Priyanka Gandhi Said UP CM: You Can See My Face Cant You | Sakshi
Sakshi News home page

Priyanka Gandhi: యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థి ఎవరు?... క్లూ ఇచ్చిన ప్రియాంక!

Jan 21 2022 4:03 PM | Updated on Jan 22 2022 12:36 PM

Priyanka Gandhi Said UP CM: You Can See My Face Cant You - Sakshi

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయాలు చాలా ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఈ మేరకు బీజేపీ నుంచి యోగి ఆదిత్యనాథ్,  సమాజ్‌వాదీ పార్టీ నుంచి అఖిలేశ్‌ యాదవ్‌ ఈసారి యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారు. అయితే కాంగ్రెస్‌ యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు దిగుతారు అనే దానిపై సర్వత్రా ఊహాగానాలు రేకెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో శుక్రవారం కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోను విడుదల చేస్తున్న సమయంలో యూపీ కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థి ఎవరు అని మీడియా ప్రశ్నించింది. దీనికి ప్రియాంక స్పందిస్తూ.." మీకు ఇంకెవరైనా కనిపిస్తున్నారా ?. మీరు నన్నే ఎందుకు అనుకోకూడదు." అని బదులు ఇచ్చారు. అయితే తాను ఎన్నికల్లో పోటీచేసే విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. అంతేకాదు ఇప్పటివరకు ఎన్నికలకు దూరంగా ఉన్న ఆమె ఇప్పుడూ తాను సిద్దంగా ఉన్నాను అని తొలిసారిగా చెప్పి ఆశ్చర్యానికి గురి చేశారు.

దీంతో కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థిగా ప్రియంక గాంధీ పేరు దాదాపు ఖాయం అనే అనిపిస్తోంది. పైగా ఒక వేళ కాంగ్రెస్‌ గెలిస్తే ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ ప్రియాంక గాంధీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. అయితే యోగి ఆదిత్యనాథ్,  అఖిలేష్ యాదవ్ ఎప్పుడూ రాష్ట్ర ఎన్నికలలో పోటీ చేయలేదు. అయినప్పటికి ఇద్దరూ ముఖ్యమంత్రులయ్యారు. ఆ తర్వాత రాష్ట్ర శాసన మండలికి ఎన్నికయ్యారు.  కానీ ఇప్పుడూ వచ్చే ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్‌ గోరక్‌పూర్‌ నుంచి పోటీకి దిగుతుండగా.., అఖిలేష్‌ యాద్‌  మెయిన్‌పురిలోని కర్హాల్ స్థానం పోటీ చేస్తున్నారు. ఈ మేరకు యూపీలో ఫిబ్రవరి 10 నుంచి ఏడు విడతల్లో ఎన్నికలు జరగునున్న సంగతి తెలిసిందే.

(చదవండి: ప్రియాంక పర్వం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement