వక్ఫ్‌ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర | President Draupadi Murmu signs Waqf Amendment bill 2025 into law | Sakshi
Sakshi News home page

వక్ఫ్‌ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర

Apr 6 2025 6:37 AM | Updated on Apr 6 2025 10:11 AM

President Draupadi Murmu signs Waqf Amendment bill 2025 into law

న్యూఢిల్లీ: వక్ఫ్‌ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర పడింది. ఇప్పటికే పార్లమెంటు ఆమోదం పొందిన వక్ఫ్‌ (సవరణ) బిల్లు–2025 (ఉమీద్‌)పై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శనివారం సంతకం చేశారు. శనివారం రాత్రి ఈ మేరకు కేంద్రం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

దాంతో వక్ఫ్‌ బిల్లు చట్టరూపం దాల్చింది. తీవ్ర వాదోపవాదాలు, విపక్షాల అభ్యంతరాల నేపథ్యంలో వక్ఫ్‌ బిల్లుపై ఉభయ సభల్లోనూ ఓటింగ్‌ జరగడం, లోక్‌సభలో 288–232, రాజ్యసభలో 128–95 ఓట్ల తేడాతో బిల్లు గట్టెక్కడం తెలిసిందే..   

Advertisement
 
Advertisement
Advertisement