రూ.1.25 లక్షల కోట్లతో 700 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం

PM Narendra Modi unveils 11 godowns under world largest grain storage plan - Sakshi

వచ్చే ఐదేళ్లలో వేలాది గోదాములు: మోదీ  

న్యూఢిల్లీ:  దేశంలో సహకార రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార ధాన్యాల నిల్వ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమం అమలుకు రూ.1.25 లక్షల కోట్లకుపైగా నిధులు వెచి్చంచనున్నారు. అలాగే వచ్చే ఐదేళ్లలో 700 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యాన్ని సృష్టించనున్నారు. ఇందులో భాగంగా 11 రాష్ట్రాల్లో 11 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల(పీఏసీ) పరిధిలో నిర్మించిన 11 గోడౌన్లను మోదీ ప్రారంభించారు.

రాబోయే ఐదేళ్లలో వేలాది గోదాములు నిర్మించబోతున్నట్లు ఆయన ఈ సందర్భంగా చెప్పారు. 500 పీఏసీల పరిధిలో గోదాముల నిర్మాణానికి, వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పన పనులకు మోదీ శంకుస్థాపన చేశారు. 18,000 పీఏసీలను కంప్యూటీకరించే ప్రాజెక్టును ప్రారంభించారు. దేశంలో ఆహార ధాన్యాల నిల్వకు సరైన సదుపాయాలు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు.

ఈ సమస్యను గత ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోలేదని తప్పుపట్టారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రూ.1.25 లక్షల కోట్లలో వ్యయంతో రాబోయే ఐదేళ్లలో 700 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం సృష్టించే పథకానికి శ్రీకారం చుట్టామని వెల్లడించారు. రైతులు తమ పంట ఉత్పత్తులను గోదాముల్లో నిల్వ చేసుకోవచ్చని, వాటిపై రుణం పొందవచ్చని, మార్కెట్‌లో సరైన ధర లభించినప్పుడు పంటలు విక్రయించుకోవచ్చని తెలియజేశారు.   

కేబినెట్‌ భేటీకి యాక్షన్‌ ప్లాన్‌తో రండి  
కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ సూచన   
లోక్‌సభ ఎన్నికలు మరో 100 రోజులలోపే జరుగనున్న నేపథ్యంలో మార్చి 3వ తేదీన కేంద్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయించారు. ఈ భేటీని ఆయన కీలకంగా భావిస్తున్నారు. స్పష్టమైన, ఆచరణ యోగ్యమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని కేబినెట్‌ సమావేశానికి హాజరు కావాలని మంత్రులకు ఆయన సూచించినట్లు ప్రభుత్వ వర్గాలు శనివారం వెల్లడించాయి. కేబినెట్‌ భేటీలో మంత్రులంతా వారి యాక్షన్‌ ప్లాన్‌ సమరి్పంచాలని ప్రధానమంత్రి పేర్కొన్నట్లు తెలియజేశాయి. 

whatsapp channel

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top