బిలియన్‌ కోల్‌ ఫీట్‌.. భారత్‌కు ఇది గర్వకారణం | PM Modi Hails Historic One Billion Tonne Coal Output Milestone | Sakshi
Sakshi News home page

బొగ్గు బిలియన్‌ ఘనతపై కిషన్‌రెడ్డి ట్వీట్‌కు ప్రధాని రీట్వీట్‌

Mar 22 2025 2:13 PM | Updated on Mar 22 2025 2:13 PM

PM Modi Hails Historic One Billion Tonne Coal Output Milestone

న్యూఢిల్లీ: బొగ్గు ఉత్పత్తిలో భారత్ ఒక బిలియన్ టన్నుల మైలురాయిని అధిగమించడంపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అత్యాధునిక సాంకేతికతలు, సమర్థవంతమైన పద్ధతులతో ఉత్పత్తిని పర్యావరణానికి హాని చేయకుండానే బొగ్గు ఉత్పత్తిని పెంచగలిగామని చెప్పారాయన.

.. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్లకు ఇది పరిష్కారం చూపుతుంది. ఆర్థిక వృద్ధిని పెంచడంతో పాటు ప్రతి భారతీయుడికి ఉజ్వల భవిష్యత్తును ఇస్తుంది. మోదీ నాయకత్వంలో గ్లోబల్ ఎనర్జీ లీడర్‌గా భారత్ ఎదుగుతోంది అని కిషన్‌రెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే ఈ ట్వీట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ రీట్వీట్‌ చేశారు. ఇది దేశం గర్వించదగ్గ విషయమన్న ప్రధాని మోదీ.. ఎనర్జీ అవసరాలను తీర్చడానికి మన సొంత కాళ్లపై నిలబడుతున్నామని చెప్పారు. 

కరెంట్ ఉత్పత్తితో పాటు వివిధ ఫ్యాక్టరీలలో బొగ్గును వాడతారన్నది తెలిసిందే. 2023–24 లో 99.78 కోట్ల టన్నుల బొగ్గును ఇండియా ఉత్పత్తి చేయగా, 2024–25 లో 108 కోట్ల టన్నులను ఉత్పత్తి చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement