’మహిళలకు నేను క్షమాపణలు చెబుతున్నా’ | PM Modi Address Nation Women's Quota Bill Failing Parliament Test | Sakshi
Sakshi News home page

’మహిళలకు నేను క్షమాపణలు చెబుతున్నా’

Apr 18 2026 8:36 PM | Updated on Apr 19 2026 11:09 AM

 PM Modi Address Nation  Women's Quota Bill Failing Parliament Test

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ‘మహిళలకు నేను క్షమాపణలు చెబుతున్నాను. మహిళా రిజర్వేషన్లను అడ‍్డుకునేందుకు విపక్షాలు ఎలా ప్రవర్తించాయో దేశం మొత్తం చూసింది. బిల్లును వ్యతిరేకించి విపక్షాలు తప్పు చేశాయి. మహిళా రిజర్వేషన్ల కోసం చిత్తశుద్ధితో కట్టుబడి ఉన్నాం. భారత మహిళల కలలను నాశనం చేశారు. దేశహితమే మాకు ముఖ్యం’ అని తెలిపారు. 
 
కాంగ్రెస్‌, టీఎంసీ, ఎస్పీ, డీఎంకే పార్టీలన్నీ మహిళలకు వ్యతిరేకం. నారీశక్తి ఎదగకుండా అడ్డుకున్నాయని మోదీ ఆరోపించారు. 40 ఏళ్లుగా మహిళలు తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. మహిళా రిజర్వేషన్‌ను అడ్డుకున్న పాపం విపక్షాలను వదిలిపెట్టదు. కొందరికి దేశం కంటే రాజకీయమే ముఖ్యం. విపక్షాలు సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉంది. పాపం చేసిన విపక్షాలకు శిక్ష తప్పదు. మహిళలకు రిజర్వేషన్‌ ఇవ్వడం విపక్షాలకు ఇష్టం లేదు. మహిళా బిల్లును అడ‍్డుకుని బ్రూణహత్యకు పాల్పడ్డాయి‘ అని మోదీ ప్పారు.

కాంగ్రెస్ పార్టీకి శిక్ష తప్పదు
‘మహిళా రిజర్వేషన్ బిల్లును గర్భంలోనే చంపేశారు. ఈ భ్రూణ హత్యలకు కాంగ్రెస్ పార్టీకి శిక్ష తప్పదు. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ మూల్యం చెల్లించుకోవాల్సిందే. మహిళలకు అన్యాయం చేశారు. మహిళా బిల్లును ఓడించి కొట్టిన చప్పట్లు.. మహిళలకు చేసిన గాయాలు. కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ సమాజ్ వాదీ పార్టీ నిజస్వరూపం బయటపడింది.

కాంగ్రెస్ తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటుందని భావించా. కానీ మహిళలకు న్యాయం చేసే అవకాశాన్ని జారవిడుచుకుంది. మిత్రపక్షాలపై ఆధారపడి కాంగ్రెస్ పార్టీ బతుకుతుంది. ఇప్పుడున్న సీట్ల నిష్పత్తి ప్రకారమే నియోజకవర్గాలను పెంచాలని ప్రతిపాదించా. ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదు. 

అన్ని రాష్ట్రాలలో నియోజకవర్గాలు పెరిగి ఎక్కువ మందికి అవకాశాలు వచ్చేవి. కానీ, డీఎంకే, టీఎంసీ, కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ సంస్కరణల వ్యతిరేక పార్టీ. ట్రిపుల్‌ తలాక్‌, ఆర్టికల్‌ 370ని కూడా వ్యతిరేకించింది. డీలిమిటేషన్‌పై దుష్ప్రచారం చేశారు’ అని మోదీ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement