Omicron Variant: కేంద్రం కీలక నిర్ణయం.. నైట్‌ కర్ఫ్యూ విధించాలంటూ లేఖ..

Omicron: Night Curfew in 27 Districts With High COVID19 positivity Rate - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్‌ కట్టడికి కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాలకు పలు సూచనలు చేసింది. కరోనా నిబంధనలను విధిగా అమలుచేయాలని దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ లేఖ రాశారు.

10 రాష్ట్రాల్లోని 27 జిల్లాలో పాజిటివిటి రేటు గత రెండు వారాల్లో పెరుగుతూ వస్తోంది. కేరళ, మిజోరాం, సిక్కింలోని 8 జిల్లాల్లో 10 శాతం పాజిటివిటి రేటు ఉండగా.. మరో 7 రాష్ట్రాల్లో 5 నుంచి 10 పాజిటివిటి రేటు ఉన్నట్లు కేంద్రం పేర్కొంది. వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న జిల్లాలపై మరింత దృష్టి పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. అవసరమైతే రాత్రి కర్ఫ్యూ అంశాన్ని కూడా పరిశీలించాలని కేంద్రం లేఖలో పేర్కొంది.

దవండి: (ఒమిక్రాన్‌ అలజడి..! భారత్‌ను కుదిపేయనుందా...?)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top