ఒమిక్రాన్‌ అలజడి..! భారత్‌ను కుదిపేయనుందా...? కేంద్రం ఏం చెప్పిందంటే..!

Omicron Impact To Be Less Severe In India With Increasing Vaccination Pace: Government - Sakshi

కోవిడ్‌-19 భారత ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావాన్నే చూపింది. వ్యవసాయం, మత్స్యరంగం, మినహా దేశంలో సకల రంగాలూ 2020–21 ఆర్థిక సంవత్సరంలో తిరోగమనంలోనే వున్నాయని జాతీయ గణాంక కార్యాలయం వెల్లడించింది. కాగా తాజాగా దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌పై ప్రపంచదేశాలు భయపడిపోతున్నాయి. 

మైనస్‌ 7.3 శాతంగా వృద్ధిరేటు..!
కరోనా మహమ్మారి ఫస్ట్‌వేవ్‌ను ఎదుర్కోవడం కోసం వచ్చిన లాక్‌డౌన్‌తో దేశ వృద్ధి రేటు మైనస్‌ 7.3 శాతంగా నమోదు అయింది. కరోనా సెకండ్‌ వేవ్‌లో కూడా గ్రోత్‌ రేట్‌ కాస్త మెరుగైంది. వేగవంతమైన వ్యాక్సినేషన్‌ ప్రక్రియనే ఆయా దేశాలను ఆర్థిక సంక్షోభాల నుంచి కాపాడుతుందని ప్రపంచ ఆర్థిక సంస్థలు వెల్లడించాయి. సరైన జాగ్రత్తలు తీసుకొకుంటే ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థపై భారీగానే ప్రభావం చూపుతోందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.   

వేగవంతమైన వ్యాక్సినేషన్‌..!
భారత్‌లో ఇప్పటివరకు 33 ఒమిక్రాన్‌ వేరియంట్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్‌ ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపనుందనే విషయాలను ఆర్థిక మంత్రిత్వ శాఖ తన నివేదికలో వెల్లడించింది. భారత్‌లో టీకా వేగాన్ని పెంచడంతో ఓమిక్రాన్ వేరియంట్ ప్రభావం తక్కువగా ఉండే అవకాశం ఉందని ప్రాథమిక ఆధారాలు సూచిస్తున్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ- నవంబర్ 2021 నెలవారీ ఆర్థిక నివేదికలో పేర్కొంది. మార్కెట్ సెంటిమెంట్లు, వేగవంతమైన టీకా కవరేజ్, బలమైన బాహ్య డిమాండ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI),  ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో రానున్న త్రైమాసికాల్లో భారత్‌ ఆర్థికంగా బలపడుతుందని అంచనా వేసింది. 

రెండో త్రైమాసికంలో 8.4 శాతం గ్రోత్‌..!
గత ఏడాది రెండో త్రైమాసికంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో భారత్‌ స్థూల జాతీయోత్పత్తి (GDP) 8.4 శాతానికి పెరిగింది. సుమారు 100 శాతానికి పైగా జీడీపీ పుంజుకుంది. సేవ రంగం, తయారీ రంగాల్లో పూర్తి పునరుద్ధరణ, వ్యవసాయ రంగంలో స్థిరమైన వృద్ధి కారణంగా జీడీపీ పుంజుకోవడానికి సహాయపడింది. ప్రైవేట్‌ రంగంలో రికవరీ మొదటి త్రైమాసికంలో 88 శాతం నుంచి రెండో త్రైమాసికంలో 96 శాతానికి పెరిగింది. సరఫరా విభాగంలో  వ్యవసాయ రంగంలో జీవీఏ దాని ప్రీ-పాండమిక్ స్థాయి కంటే ఎక్కువగా కొనసాగుతోంది. తయారీ , నిర్మాణ రంగాలు కూడా వాటి ప్రీ-పాండమిక్ స్థాయిలను అధిగమించి భారత వృద్ధికి కీలక చోదకాలుగా ఉద్భవించాయి.

చదవండి: ద్రవ్యోల్బణం ఆందోళనలు ? పడిపోతున్న రూపాయి విలువ !

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top