
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశం మీద ప్రతీకార సుంకాలను విధించడం మాత్రమే కాకుండా.. 'ఇండియా డెడ్ ఎకానమీ' అని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే దీనికి భారత్ గట్టి సమాధానం చెప్పింది. 2026 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ - జూన్ త్రైమాసికంలో జీడీపీ అంచనాలను అధిగమించి 7.8% వృద్ధిని నమోదు చేసింది. దీనిని నేషనల్ స్టాటిస్టిక్ ఆఫీస్ (NSO) శుక్రవారం విడుదల చేసిన డేటా స్పష్టం చేసింది.
కేంద్ర గణాంకాల విభాగం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత ఆర్ధిక వ్యవస్థ 7.8 శాతంగా నమోదైంది. గత ఐదు త్రైమాసికాల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం.
2026 మొదటి త్రైమాసికంలో వ్యవసాయ రంగం బాగా అభివృద్ధి చెందింది. ఇది జీడీపీ వృద్ధికి దోహదపడింది. అంతే కాకుండా.. మైనింగ్ రంగం, తయారీ, విద్యుత్ రంగాల వృద్ధి కూడా దేశ ఆర్ధిక వ్యవస్థకు బాగా దోహదపడ్డాయి. ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థల్లో.. భారత్ ముందు వరుసలో ఉంది అనడానికి.. తాజాగా విడుదలైన గణాంకాలే నిదర్శనం. దీన్నిబట్టి చూస్తే భారత్ మరింత వేగంగా వృద్ధి చెందుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
Real #GDP has witnessed 7.8% growth rate in Q1 of FY 2025-26 over the growth rate of 6.5% during Q1 of FY 2024-25.@PMOIndia @Rao_InderjitS @PIB_India @_saurabhgarg@mygovindia @NITIAayog @PibMospi pic.twitter.com/nQw8Iwo9sG
— Ministry of Statistics & Programme Implementation (@GoIStats) August 29, 2025