అటు మోదీ మౌనంపై లేఖ.. ఇంతలో దేశ పాలిటిక్స్‌లో మరో సంచలనం

Non BJP Party CMs likely To Meet In Mumbai - Sakshi

సాక్షి, ముంబై: దేశంలో పాలిటిక్స్‌ మరోసారి వేడెక్కాయి. ప్రస్తుతం దేశం నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు త్వరలో ముంబై వేదిక కానుంది. బీజేపీయేతర ముఖ్యమంత్రుల సమావేశం ముంబైలో జరుగుతుందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆదివారం తెలిపారు.

ఈ సందర్బంగా సంజయ్‌ రౌత్‌ మాట్లాడుతూ.. దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులతోపాటు ద్రవ్యోల్బణం, మత విద్వేషాలు, కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం వంటి అంశాలపై చర్చ జరుగుతుందని చెప్పారు. ​కాగా, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఈ సమావేశానికి సంబంధించి బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాసినట్టు తెలిపారు. మమతా బెనర్జీ లేఖపై సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే, ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవారు చర్చించారని ఆయన వెల్లడించారు.

ఇదిలా ఉండగా.. దేశంలో పలు చోట్ల జరుగుతున్న మత ఘర్షణలు, విద్వేష ప్రసంగాలపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వీడి మాట్లాడాలని 13 విపక్ష పార్టీల నేతలు శనివారం లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీయేతర రాష్ట్రాల సీఎం సమావేశం జరుగనుండటం దేశంలో హాట్‌ టాపిక్‌గా మారింది.

హిందూ ఒవైసీ..
మరోవైపు.. మహారాష్ట్రలో పరిస్థితులపై సంజయ్‌ రౌత్‌ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. నవనిర్మాణ సేన(ఎంఎన్‌ఎస్‌) అధ్యక్షుడు రాజ్‌ ఠాక్రేపై సంజయ్‌ రౌత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఠాజ్‌ ఠాక్రే ‘హిందూ ఒవైసీ’ అని, ఎంఎన్‌ఎస్‌ ‘హిందుత్వ మజ్లిస్‌ పార్టీ’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే రాజ్‌ థాక్రే.. బీజేపీ అండతోనే ఇలాంటి కొన్ని విషయాలను వివాదాస్పదం చేస్తున్నారని అన్నారు.

ఇది చదవండి: శ్రీరాముడి ఆలోచ‌న‌కే అది వ్య‌తిరేక‌ం..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top