ఈఎస్‌జె: మైనింగ్‌, పరిశ్రమలు.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

No Mining Factories Within 1 Km Of Sanctuaries Parks Orders SC - Sakshi

న్యూఢిల్లీ: అడవుల పరిరక్షణ కోసం మైనింగ్‌, పరిశ్రమల విషయంలో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వన్యప్రాణుల అభయారణ్యాలు, జాతీయ పార్కులకు కిలోమీటర్‌ పరిధిలో ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించకూడదని స్పష్టం చేసింది. ఆ ప్రాంతంలో శాశ్వత నిర్మాణాలను నిషేధించింది.

దేశవ్యాప్తంగా ఎకో-సెన్సిటివ్ జోన్‌లు (ESZ పర్యావరణ సున్నిత మండలాలు),  చుట్టుపక్కల కార్యకలాపాలను నియంత్రించడంపై తాజాగా ఆదేశాలు జారీ చేసింది సుప్రీం. ఈ మేరకు శుక్రవారం.. బఫర్‌ జోన్‌కు కిలోమీటర్‌ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు ఉండరాదని స్పష్టం చేసింది. 

ఈ జోన్‌ల వెంబడి జరుగుతున్న తయారీ, తయారీ సంబంధిత కార్యకలాపాలు చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అనుమతితో మాత్రమే కొనసాగుతాయని కోర్టు తీర్పు స్పష్టం చేసింది. అలాగే ప్రతి రాష్ట్రం తరపున..  చీఫ్ కన్జర్వేటర్ ESZ హోదా కింద వచ్చే నిర్మాణాల జాబితాను సిద్ధం చేసి మూడు నెలల్లో సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే వన్యప్రాణుల అభయారణ్యాలు, జాతీయ ఉద్యానవనాలలో ఎలాంటి మైనింగ్‌ కార్యకలాపాలు ఉండరాదని పేర్కొంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top