పార్లమెంటులో హార్డ్‌కాపీలు ఉండవు

న్యూఢిల్లీ: వచ్చేనెలలో జరగనున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఆర్డినెన్స్‌లకు సంబంధించి హార్డ్‌కాపీలను (కాగితాల రూపంలో) పంపిణీ చేయడం ఉండదని లోక్‌సభ సచివాలయం తెలిపింది. ప్రభుత్వం గడిచిన ఆరునెలల్లో తెచ్చిన పలు ఆర్డినెన్స్‌లు ఆమోదం కోసం పార్లమెంటు ముందుకు రానున్నాయి. ఎంపీలకు భౌతికంగా కాగితాలు అందజేస్తే... కరోనా వ్యాప్తి చెందే అవకాశాలుంటాయి కాబట్టి సాఫ్ట్‌కాపీలను అందజేస్తామని లోక్‌సభ సచివాలయం సోమవారం ఒక ప్రకటనలో వివరించింది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి