ప్రకటించిన ఎన్‌సీఈఆర్‌టీ
ఆర్‌ఎస్‌ఎస్, ఏబీవీపీలతో సంబంధమున్న నలుగురికి చోటు
న్యూఢిల్లీ: భారతీయ జ్ఞానాన్ని విద్యార్థులకు చేరువ చేసే లక్ష్యంతో ఎన్‌సీఈఆర్‌టీ పదకొండు, పన్నెండవ తరగతుల రాజకీయ శాస్త్ర పాఠ్యపుస్తకాల అభివృద్ధికి కొత్త టీమ్‌ను పునర్వ్యవస్థీకరించింది. నవంబర్ నాటికల్లా 11వ తరగతి పాఠ్యపుస్తకం, వచ్చే ఏడాది జూలైకి 12వ తరగతి పుస్తకాలను అభివృద్ధి చేయాలని ఈ కమిటీకి నిర్దేశించారు. ఈ టెక్ట్స్‌బుక్ టీమ్‌కు విద్యావేత్త, రాజకీయ విశ్లేషకుడు సందీప్ శాస్త్రి నేతృత్వం వహిస్తున్నారు. కర్ణాటకలోని డీమ్డ్ యూనివర్సిటీ నిట్టే ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.
బృందంలో కనీసం నలుగురు ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ), బీజేపీతో ప్రత్యక్ష/పరోక్ష సంబంధాలు కలి గి ఉన్నట్లు పత్రాల ఆధారంగా తెలుస్తోంది. విద్యా మంత్రిత్వశాఖ సీనియర్ కన్సల్టెంట్ యదునాథ్ దేశ్‌పాండే, ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థ జ్ఞాన ప్రబోధిని (పుణే)తో దీర్ఘకాలిక అనుబంధం ఉన్న ప్రశాంత్ దివేకర్, జేఎన్‌యూ సెంటర్ ఫర్ పొలిటికల్ స్టడీస్ అధ్యాపకురాలు, ఏబీవీపీ మాజీ జాతీయ కార్యదర్శి వందనా మిశ్రా. వీరితోపాటు జేఎన్‌యూ సెంటర్ ఫర్ కంపేరేటివ్ పాలిటిక్స్ అండ్ పొలిటికల్ థియరీ అసోసియేట్ ప్రొఫెసర్ రవి రామేశ్‌చంద్ర శుక్లాలు ఈ బృందంలో ఉన్నారు. వీరితోపాటు దేశంలోని పలు యూనివర్సిటీ అధ్యాపకులను ఈ టీమ్‌లో సభ్యులుగా చేర్చారు.


