breaking news
Textbooks syllabus Syllabus Committee
-
పాఠ్యపుస్తకాల సలహాదారులుగా కొనసాగలేం
న్యూఢిల్లీ: నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైయినింగ్(ఎన్సీఈఆర్టీ) పాఠ్యపుస్తకాల సిలబస్‌లో కోతలపై ప్రధాన సలహాదారులుగా వ్యవహరిస్తున్న సుహాస్ పల్షికర్, యోగేంద్ర యాదవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. 9 నుంచి 12వ తరగతి వరకు పొలిటికల్ సైన్స్ పాఠ్య పుస్తకాల సిలబస్ నుంచి కొన్ని అంశాల తొలగింపు ఏకపక్షంగా, అహేతుకంగా ఉందని వారు పేర్కొన్నారు. హేతుబద్ధీకరణ అంటూ పాఠ్యాంశాలను వికృతీకరించి, వాటిని విద్యాపరంగా పనికిరానివిగా మార్చారని ఆరోపించారు. తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, అభిప్రాయం తెలుసుకోకుండా ఎన్సీఈఆర్టీ తీసుకున్న ఈ చర్య ఇబ్బందికరంగా ఉందని తెలిపారు. ఆయా పాఠ్యపుస్తకాల్లో ప్రధాన సలహాదారుల జాబితాలో ఉన్న తమ పేర్లను వెంటనే తొలగించాలని కోరుతూ ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ దినేశ్ సక్లానీకి లేఖ రాశారు. మహాత్మాగాంధీ మరణం దేశంలో మత సామరస్యతపై చూపిన సానుకూల ప్రభావం, ఆర్ఎస్ఎస్పై కొంతకాలం నిషేధం, 2002లో గుజరాత్ అల్లర్లు వంటి విషయాలను సిలబస్ నుంచి తొలగిస్తూ గత నెలలో ఎన్సీఈఆర్టీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తప్పుపట్టాయి. 2006–07లో ముద్రించిన ఎన్సీఈఆర్టీ 9 నుంచి 12వ తరగతి పొలిటికల్ సైన్స్ పాఠ్యపుస్తకాలకు వీరిద్దరూ ప్రధాన సలహాదారులుగా ఉన్నారు. పల్షికర్, యోగేంద్ర యాదవ్ రాజనీతి శాస్త్ర నిపుణులు. కాగా, యోగేంద్ర యాదవ్ స్వరాజ్ ఇండియా అనే సంస్థను నడుపుతున్నారు. -
సిలబస్ మార్పులు ఎన్నాళ్లు?
పూర్తికాని పాఠ్యపుస్తకాల సిలబస్ మార్పుల ప్రక్రియ ⇒ ఇప్పటికే సగం ముద్రణ పూర్తి కావాల్సి ఉన్నా.. ⇒ ఇంకా మార్పుల దశలోనే ⇒ ముద్రణ టెండర్లే ఖరారు కాని వైనం ⇒ పేపరు కొనేదెప్పుడు.. పుస్తకాలను ముద్రించేదెప్పుడు? సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పాఠ్య పుస్తకాల్లో మార్పుల ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. గత నెల రోజులుగా సిలబస్‌లో మార్పుల ప్రక్రియ చివరి దశకు చేరుకుందని చెబుతున్నా, సిలబస్ కమిటీ ప్రభుత్వానికి ఇంకా నివేదికను ఇవ్వలేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఒకటి నుంచి పదో తరగతి వరకున్న తెలుగు, సాంఘిక శాస్త్రం పాఠ్య పుస్తకాల్లో మార్పులపై గత ఆగస్టు 28న ప్రభుత్వం నియమించిన కమిటీ కసరత్తు చేస్తూనే ఉంది. నవంబర్‌కల్లా సిలబస్‌లో చేసిన మార్పులపై నివేదిక ఇవ్వాల్సి ఉన్నప్పటికీ, ఇప్పటికీ పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి అందించలేకపోయింది. మార్పుల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. సిలబస్‌లో మార్పుల ప్రక్రియ ఆలస్యం అవుతున్నకొద్దీ ఆ ప్రభావం పుస్తకాల పంపిణీపైనా పడే అవకాశం ఉంది. కమిటీ తమ నివేదికను ప్రభుత్వానికి అందించాక అందులోని అంశాలను పరిశీలించేందుకు, మార్పులను ముఖ్యమంత్రి స్థాయిలో ఖరారు చేసేందుకు మరింత సమయం పట్టనుంది. మరోవైపు ముద్రణకు సంబంధించి పేపరు కొనుగోలుకోసం మొదట్లో పిలిచిన టెండర్లను రద్దు చేసి, మళ్లీ పిలిచారు. అవి ఖరారు చేసేందుకు, ఆ తరువాత ముద్రణకోసం టెండర్లు పిలిచేందుకు మరింత సమయం పట్టనుంది. ముద్రణ టెండర్లను ఖరారు చేశాక ప్రింటర్లకు పనులను అప్పగించాల్సి ఉంటుంది. తర్వాత వాటిని ముద్రించి పాఠశాలలకు పుస్తకాలు పంపేసరికి చాలా సమయం పడుతుందని పరిశీలకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఈసారి జూన్ 12వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభం అయ్యే నాటికి విద్యార్థులకు పుస్తకాలు అందించడం సాధ్యమయ్యేలా కనిపించడంలేదు. బడులు తెరిచే నాటికి ఇవ్వకపోయినా కనీసం ఒకటీ రెండు నెలలు ఆలస్యంగానైనా పుస్తకాలను అందించేందుకు పక్కా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని వారు అంటున్నారు. తెలుగు పాఠ్యపుస్తకాల్లో మార్పులు.. సిలబస్‌లో మార్పులపై ఇప్పటి వరకు రూపొందించిన ప్రణాళికల ప్రకారం.. ఒకటి నుంచి పదో తరగతి వరకున్న తెలుగు పాఠ్య పుస్తకాల్లో భారీగా మార్పులు చోటు చే సుకోనున్నాయి. కాగా, ఈ సారి అన్ని తరగతుల సాంఘిక శాస్త్రాల్లో మార్పులు చేయడం లేదు. 6, 7, 8 తరగతుల సాంఘిక శాస్త్రాల్లో మాత్రం మార్పులు చేస్తున్నారు. 9, 10 తరగతుల సాంఘిక శాస్త్రాల్లో వచ్చే ఏడాదే మార్పులు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. ప్రధాన మార్పులు ఇవీ.. ⇒ 9, 10 సహా అన్ని తరగతుల్లో ఆంధ్రప్రదేశ్ చిత్రపటాలు ఉన్న చోట తెలంగాణ చిత్రపటాలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర ఉన్న చోట తెలంగాణ సమగ్ర చరిత్ర ఉంటుంది. భారత దేశ పటంలో ఆంధ్రప్రదేశ్‌ను, తెలంగాణను వేరుగా చూపిస్తారు. ⇒ 6, 7, 8 తరగతుల్లో తెలంగాణ భౌగోళిక పరిస్థితులు, పరిసర రాష్ట్రాలు, వాటితో సంబంధాలపై పాఠాలు ఉండనున్నాయి. నదులు, ఉపనదులు, చెరువులు, పంటలకు ప్రధాన సాగునీటి ఆధారాలు, ఒకప్పటి చెరువులు, వాటి ప్రాధాన్యం, ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయపై చోటు కల్పిస్తున్నట్లు తెలిసింది. ⇒ తెలంగాణ ఉద్యమ చరిత్ర, ఆంధ్రప్రదేశ్ అవ తరణకు ముందు.. తరువాత అంశాలు, ఉద్యమంలో కేసీఆర్, టీఆర్ఎస్ పాత్రపై పాఠ్యాంశాలు, నిజాం పాలన, రజాకార్లు, నాటి పరిస్థితులపైనా పాఠాలు ఉంటాయి. అలాగే పెద్ద మనుషుల ఒప్పందం, సాయుధ పోరాట యోధులు, వారి చరిత్ర, ప్రత్యేక తెలంగాణ పోరాటానికి దారి తీసిన పరిస్థితులను పాఠ్యాంశాలుగా చేర్చుతున్నారు. ⇒ తెలంగాణ వైతాళికులైన ప్రొఫెసర్ జయశంకర్, చాకలి ఐలమ్మ, కొమురం భీం, కొండా లక్ష్మణ్‌బాపూజీ తదితరుల జీవిత చరిత్ర, తెలంగాణ రాష్ట్రం కోసం వారి కృషిపైనా పాఠ్యాంశాలు ఉంటాయని తెలిసింది.