సిద్ధూ టిట్‌ ఫర్‌ టాట్‌ రాజకీయం

Navjot Singh Sidhu Joins Protesting Teachers Outside Delhi CM Kejriwals Residence - Sakshi

న్యూఢిల్లీ: పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు నవజోత్‌ సింగ్‌ సిద్ధూ టిట్‌ ఫర్‌ టాట్‌ రాజకీయాలకు దిగారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ నివాసం ఎదుట దేశా రాజధానిలో నిరసన చేస్తున్న టీచర్లతో కలిసి ఆయన కూడా తన గళాన్ని వినిపించారు. ప్రభుత్వ కాంట్రాక్ట్‌ టీచర్లు తమని రెగ్యులర్‌ చేయాలన్న డిమాండ్‌తో చేస్తున్న నిరసన ప్రదర్శనల్లో ఆదివారం సిద్ధూ కూడా పాల్గొన్నారు.

గత నెలలో పంజాబ్‌లోని మొహాలిలో కాంట్రాక్ట్‌ టీచర్లు రెగ్యులరైజేషన్‌ కోరుతూ నిరసన చేస్తుంటే కేజ్రీవాల్‌ వారికి మద్దతుగా ఆ ధర్నాలో పాల్గొన్నారు. ఇప్పుడు సిద్ధూ టిట్‌ ఫర్‌ టాట్‌ అన్నట్టుగా అదే డిమాండ్‌ చేస్తున్న ఢిల్లీ టీచర్లతో కలిసి నిరసన ప్రదర్శన నిర్వహించారు. పంజాబ్‌లో ఆప్‌ అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్‌ టీచర్లని పర్మనెంట్‌ చేస్తామని, విద్యా వ్యవస్థని సంపూర్ణంగా ప్రక్షాళన చేస్తామని ఇప్పటికే కేజ్రీవాల్‌ హామీలు ఇచ్చారు. ఢిల్లీలో కూడా కాంట్రాక్ట్‌ విద్యా వ్యవస్థని పెట్టుకొని పంజాబ్‌లో ఏం చేస్తారని సిద్ధూ ప్రశ్నించారు.  ఖాళీలన్నీ గెస్ట్‌ టీచర్లతోనే కేజ్రీవాల్‌ భర్తీ చేస్తున్నారన్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top