ఆర్మీ జాబ్స్‌: 502 పోస్టులు, నెలకు రూ.35,400

MES Recruitment 2021: Draughtsman and Supervisor Posts, Apply Online - Sakshi

మిలిటరీ ఇంజనీరింగ్‌ సర్వీస్‌–2021

502 సూపర్‌వైజర్, డ్రాఫ్ట్స్‌మెన్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

భారత సైనిక విభాగానికి చెందిన మిలిటరీ ఇంజనీరింగ్‌ సర్వీస్‌లో ఖాళీగా ఉన్న 502 సూపర్‌వైజర్‌(బ్యారక్‌ స్టోర్‌), డ్రాఫ్ట్స్‌మెన్‌ పోస్టుల భర్తీకి ఎంఈఎస్‌ నోటిఫికేషన్‌–2021 విడుదలైంది. మిలిటరీ సర్వీస్‌లో సేవలు అందించాలనుకునే అర్హత గల అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నేపథ్యంలో.. అందుబాటులో ఉన్న ఖాళీలు, విద్యార్హతలు, ఎంపిక ప్రక్రియ గురించి తెలుసుకుందాం...

పోస్టుల సంఖ్య: 502
ఎంఈఎస్‌–2021 నోటిఫికేషన్‌ ద్వారా మిలిటరీ ఇంజనీర్‌ సర్వీసెస్‌లో ఖాళీగా ఉన్న మొత్తం 502 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో 450 సూపర్‌వైజర్‌ పోస్టులు, 52 డ్రాఫ్ట్స్‌మెన్‌ పోస్టులు ఉన్నాయి.

విద్యార్హతలు
► డ్రాఫ్ట్స్‌మెన్‌ పోస్టులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఆర్కిటెక్చర్‌ అసిస్టెంట్స్‌షిప్‌లో డిప్లొమా ఉండాలి. దీంతో పాటు ఆటోక్యాడ్, ఆపరేషన్‌ ఆఫ్‌ జిరాక్స్, ప్రింటింగ్‌ అండ్‌ లామినేషన్‌ మెషీన్‌పై ఏడాది కాలం అనుభవం అవసరం. 

► సూపర్‌వైజర్‌ పోస్టులకు ఎకనామిక్స్‌/కామర్స్‌/స్టాటిస్టిక్స్‌/బిజినెస్‌ స్టడీస్‌/పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్‌ డిగ్రీ తప్పనిసరి. దీంతోపాటు స్టోర్స్‌ అండ్‌ అకౌంట్స్‌ మెయింటెనెన్స్‌లో ఏడాది అనుభవం తప్పనిసరి.లేదా ఎకనామిక్స్‌/కామర్స్‌/ స్టాటిస్టిక్స్‌/బిజినెస్‌ స్టడీస్‌/పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో గ్రాడ్యుయేషన్‌తోపాటు మెటీరియల్‌ మేనేజ్‌మెంట్‌/వేర్‌ హౌసింగ్‌ మేనేజ్‌మెంట్‌/ పర్చేజ్‌/లాజిస్టిక్స్‌/ పబ్లిక్‌ ప్రొక్యూర్‌మెంట్‌లో డిప్లొమా,స్టోర్స్‌ అకౌంట్స్‌ మెయింటెనెన్స్‌లో రెండేళ్ల అనుభవం ఉండాలి. 

► రెండు విభాగాల పోస్టులకు అభ్యర్థుల వయసు దరఖాస్తు చేసుకునే నాటికి 18 నుంచి 30 ఏళ్ల లోపు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం–ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈబీసీ రిజర్వేషన్లు అమలు చేస్తారు. 

వేతనం
► సూపర్‌వైజర్, డ్రాఫ్ట్స్‌మెన్‌గా ఎంపికైనవారు పే లెవెల్‌–6 ప్రకారం నెలకు రూ.35,400 – 1,12,400 వరకూ వేతనం అందుతుంది. 

పరీక్ష విధానం
► పరీక్ష మల్టిపుల్‌ చాయిస్‌ విధానం ఉం టుంది. 125 మార్కులకు 100 ప్రశ్నలకు రెండు గంటల్లో సమాధానాలు గుర్తించాలి. సిలబస్‌లో నాలుగు విభాగాలు ఉంటాయి.
► జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌– 25 ప్రశ్నలు –25 మార్కులు;
► జనరల్‌ అవేర్‌నెస్‌ అండ్‌ జనరల్‌ ఇంగ్లిష్‌– 25 ప్రశ్నలు–25 మార్కులు; న్యూమరికల్‌ ఆప్టిట్యూడ్‌–25 ప్రశ్నలు –25 మార్కులు;
► స్పెషలైజ్డ్‌ టాపిక్‌ – 25 ప్రశ్నలు– 50 మార్కులకు ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
► దరఖాస్తులకు చివరి తేదీ: 12.04.2021
► రిజిస్ట్రేషన్‌ ఫీజు: రూ.100 (ఎస్సీ/ఎస్టీ/ వికలాంగులకు ఫీజు లేదు)
► రాత పరీక్ష తేది: 16.05.2021
► తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: సికింద్రాబాద్, విశాఖపట్నం
► వెబ్‌సైట్‌: దరఖాస్తు కోసం https://www.mesgovonline.com/mesdmsk/లో ‘న్యూ రిజిస్ట్రేషన్‌’ లింక్‌ను ఎంపిక చేసుకోవాలి. 

ఆర్మీ జాబ్స్‌.. ఏప్రిల్‌ 18న ఎన్‌డీఏ; ఎగ్జామ్‌ టిప్స్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top