ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. 20 ఫైరింజన్లు.. | Delhi Fire Breaks Out Near Udyog Bhawan, 20 Fire Tenders Rush To Control Blaze, Watch Video Inside | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. 20 ఫైరింజన్లు..

Jun 24 2026 7:14 AM | Updated on Jun 24 2026 10:39 AM

Massive Fire Accident At Delhi

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో భారీ అగ్నిప్రమాద ఘటన చోటుచేసుకుంది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఉద్యోగ్‌ భవన్‌ సమీపంలోని స్లమ్‌ ఏరియాలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మంటలు వేగంగా వ్యాపించడంతో వెంటనే అగ్నిమాపక శాఖ అప్రమత్తమైంది. 

ఘటనాస్థలికి 20 ఫైరింజన్లు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటల కారణంగా పరిసర ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఎలక్ట్రిక్‌ ప్యానల్‌లో మంటలు చెలరేగి, అక్కడి నుంచి సమీపంలోని గుడిసెలకు వ్యాపించినట్లు అనుమానిస్తున్నారు. అయితే అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా నిర్ధారణ కాలేదు. ఘటనపై అగ్నిమాపక శాఖ, పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారు. అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement