ఖండాంతరాలు దాటిన ప్రేమ | UP Man Marries Dutch Girlfriend As Per Hindu Customs | Sakshi
Sakshi News home page

యూపీ అబ్బాయి.. డచ్ అమ్మాయి.. ఖండాంతరాలు దాటిన ప్రేమ

Published Sat, Dec 2 2023 8:40 AM | Last Updated on Sat, Dec 2 2023 8:57 AM

UP Man Marries Dutch Girlfriend As Per Hindu Customs - Sakshi

లక్నో: వారి మధ్య స్నేహం కాస్తా ప్రేమగా మారింది.. ఖండంతరాలు దాటిన ఆ ప్రేమకు పెద్దల ఆంగీకారం తోడైంది.. ఇంకేముంది మూడు ముళ్ల బందంతో ఆ జంట ఒక్కటైంది. నెదర్లాండ్స్ అమ్మాయి, యూపీ అబ్బాయి ప్రేమపెళ్లి ఇరువురి పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు రాజకీయ ప్రముఖులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై కొత్తజంటను ఆశీర్వదించారు.

హార్దిక్ వర్మ(32), ఉ‍త్తరప్రదేశ్‌ ఫతేపూర్‌కు చెందిన వ్యక్తి. ఇటీవల ఆయన ఉద్యోగ రీత్యా నెదర్లాండ్స్ వెళ్లారు. అక్కడ ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీలో సూపర్‌వైజర్‌గా ఉద్యోగం సంపాదించాడు. ఈ క్రమంలోనే తన సహోద్యోగి గాబ్రిలాతో స్నేహం ప్రేమగా మారింది. ఇద్దరు వివాహంతో ఒక్కటవ్వాలనుకున్నారు. 

గత వారం గాబ్రిలాను వెంటబెట్టుకుని ఇండియా వచ్చిన  హర్దిక్‌ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపాడు. వారు కూడా అంగీకరించడంతో నవంబర్ 29న హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం జరిపించారు. 'మా కుటుంబీకులు అంతా గుజరాత్‌లో ఉంటారు. కానీ మా పూర్వికుల నుంచి ఇళ్లు ఇక్కడే ఉంది. అందుకే అందరం ఫతేపూర్‌కు వచ్చాం. హిందూ సాంప్రదాయం ప్రకారమే గాబ్రిలాను వివాహం చేసుకున్నా. డిసెంబర్ 25న నెదర్లాండ్స్ వెళ్లిపోతాం. అక్కడ క్రిస్టియన్ సాంప్రదాయ పద్దతుల్లో కూడా వివాహం చేసుకుంటాం.' అని హర్దిక్ తెలిపారు.  

ఇదీ చదవండి: బెంగళూరులో పదుల సంఖ్యలో స్కూల్స్‌కు బాంబు బెదిరింపులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement