అలాంటి సందర్భంలో హిందూ వివాహ చట్టం సెక్షన్ 15 వర్తించదు
పునర్వివాహం తర్వాత రిస్టోరేషన్ పిటిషన్ వ్యర్థం
వివాహం మానవ హక్కు
విడాకుల వ్యాజ్యంలో మద్రాస్ హైకోర్టు స్పష్టికరణ
సాక్షి, చెన్నై: విడాకుల వ్యాజ్యానికి సంబంధించి దాఖలైన అప్పీల్‌ను డిఫాల్ట్ కారణంగా కొట్టివేస్తే (డిస్మిస్ ఫర్ డిఫాల్ట్– అప్పీలుదారు లేదా న్యాయవాది హాజరుకాకపోవడం వల్ల అప్పీల్‌ను కొట్టివేయడం) పునర్వీవాహానికి సంబంధించి హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 15 నిబంధనలు వర్తించబోవని మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ స్పష్టంచేసింది. సెక్షన్ 15.. విడాకులు పొందిన వ్యక్తులు తిరిగి వివాహం చేసుకోవడానికి ఎప్పుడు అర్హులవుతారనే నిబంధనలను తెలియజేస్తుంది. దీనిప్రకారం కోర్టు విడాకులు మంజూరు చేసిన తర్వాత.. ఆ తీర్పుపై అప్పీలు చేయడానికి అవకాశం లేకపోతే, గడువులోపు అప్పీల్ చేయకపోతే, ఒకవేళ అప్పీలు దాఖలు చేసినప్పటికీ దానిని హైకోర్టు కొట్టివేస్తే విడాకులు పొందినవారు (భర్త లేదా భార్య) చట్టబద్ధంగా మరొక వివాహం చేసుకోవచ్చు.
అయితే ‘అప్పీల్ డిస్మిస్ ఫర్ డిఫాల్ట్’అయిన సందర్భాల్లో ఈ నిబంధనల ప్రశ్నే ఉత్పన్నం కాదని జి.ఆర్. స్వామినాథన్, ఎమ్.డి. సుమతిలతో కూడిన ధర్మాసనం తీర్పులో సూచించింది. ఈ కేసులో కిందికోర్టులో విడాకులు పొందిన మహిళ పునర్వీవాహాన్ని సమర్ధించింది. కృష్ణవేణి రాయ్ కేసు తీర్పును ఉటంకించిన ధర్మాసనం ‘అప్పీల్‌ను డిఫాల్ట్ కారణంగా కొట్టివేసిన తర్వాత సెక్షన్ 15 వర్తింపు కోల్పోతుందని మేం భావిస్తున్నాం. సెక్షన్ 15లోని ‘కొట్టివేయడం’అనే పదం.. డిఫాల్ట్ కారణంగా ‘కొట్టివేయడానికి’కూడా వర్తిస్తుంది.
అప్పీల్ డిసిమ్‌స్ ఫర్ డిఫాల్ట్ అయిన సందర్భంలో దాఖలు చేసే పునరుద్ధరణ (రిస్టోరేషన్) పిటిషన్‌ను విచారించే సమయానికే ప్రతివాది పునర్వీవాహం చేసుకున్నట్లు వెల్లడైతే, ఆ అప్పీల్‌ను ప్రయోజనం లేనిదిగా (ఇన్‌ఫ్రక్చుయస్‌గా) కొట్టివేయాల్సి ఉంటుంది. పునర్వీవాహం ఎప్పుడు జరిగిందన్నది అసంబద్ధం’’అని ధర్మాసనం పేర్కొంది. అప్పీల్ దాఖలు చేయడం మాత్రమే సరిపోదని, పిటిషనర్ అప్పీల్ చేసిన రెండు నెలల వ్యవధిలోనే విడాకుల తీర్పుపై మధ్యంతర స్టే ఉత్తర్వులు పొందాలని స్పష్టంచేసింది. వివాహం చేసుకునే హక్కు అనేది మానవ హక్కని స్పష్టంచేసింది.
కేసు ఏమిటంటే..
తిరు చ్చికి చెందిన వ్యక్తికి, రామనాథపురం మహిళతో 2001లో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. భార్య ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. భార్య ప్రవర్తనపై భర్త అనుమానం వ్యక్తం చేయడంతో ఆమె 2015లో పిల్లలతో కలిసి ఇల్లు వదిలి బయటకు వచ్చేసింది. అనంతరం తిరుచ్చి కుటుంబ న్యాయస్థానంలో విడాకుల పిటిషన్ దాఖలు చేసింది. కోర్టు 2021లో విడాకులు మంజూరు చేసింది. ఈ విడాకులను రద్దు చేయాలని కోరుతూ భర్త మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్‌లో అప్పీల్ దాఖలు చేశాడు. అయితే ఈ పిటిషన్ డిస్మిస్ ఫర్ డిఫాల్ట్ అయ్యింది. భర్త రిస్టోరేషన్ పిటిషన్ వేసే సమయానికే భార్య మరో వివాహం చేసుకుంది.