
రైతులకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతులకు శాశ్వత విద్యుత్ కనెక్షన్‌ను కేవలం రూ.5 మాత్రమే అందిస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం మోహన్ యాదవ్ ప్రకటించారు. మధ్యప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ పథకాన్ని త్వరలో అమలు చేయనుంది.
ఈ సందర్భంగా సీఎం మోహన్ యాదవ్ మాట్లాడుతూ... మధ్యప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యం రైతులను ప్రోత్సహించడం. వారి జీవితాలను మెరుగుపరచడం. విద్యుత్ సమస్యలు లేకుండా, సాగునీటి అవసరాలను తీర్చేందుకు సౌర (సోలార్) పంప్‌లను ఏర్పాటు చేయబోతున్నాం. వచ్చే మూడు సంవత్సరాల్లో 30 లక్షల సోలార్ పంప్‌లను రైతులకు అందించేందుకు ప్రణాళిక రూపొందించామని చెప్పారు. రైతుల నుండి సౌర విద్యుత్‌ను ప్రభుత్వం కొనుగోలు చేయబోతుంది. తద్వారా రైతులు అదనపు ఆదాయాన్ని పొందే అవకాశముంది.
కాంగ్రెస్ పాలనలో గ్రామాల్లో సరైన రోడ్లు, విద్యుత్, మౌలిక సదుపాయాలు లేకుండా ఇబ్బంది పడ్డాం. కానీ, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది’ అని వ్యాఖ్యానించారు.