పేద ప్రజల కోసం ఎల్ఐసీ సరికొత్త భీమా పాలసీ

LIC Policy: Get Up To Rs 75,000 Life Insurance Cover For Rs 100 only - Sakshi

భారత ప్రభుత్వం ఇప్పటికే పేదల కోసం అనేక సామాజిక భద్రతా పథకాలను ప్రారంభించింది. ఈ పథకాల ఉద్దేశ్యం పేదల జీవితాల్లో వెలుగును తీసుకురావడం. ప్రధానంగా వారికీ సామాజిక భద్రత కల్పించడం. పేద ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇండియా “ఆమ్ ఆద్మీ బీమా యోజన” భీమా పాలసీని ప్రారంభించింది. ఈ పాలసీ కింద బీమా చేసిన వ్యక్తికి చాలా ప్రయోజనాలు చేకూర నున్నాయి. ఈ పాలసీ కింద చేరిన వారు భీమా కాలంలో సహజ మరణంతో మరణిస్తే నామినీకి 30 వేల రూపాయలు లభిస్తాయి. 

యాక్సిడెంటల్ డెత్ ‌కింద మరణిస్తే 75 వేల రూపాయలు అందుతాయి. ఒకవేల ఏదైనా ప్రమాదం కారణంగా శాశ్వత వైకల్యం కలిగితే 75 వేల రూపాయలు లభిస్తాయి. అలాగే ప్రమాదంలో రెండు కళ్ళు కోల్పోవడం, చేతులు లేదా కాళ్ళు రెండూ కోల్పోయిన వారితో పాటు ఒక కన్ను, ఒక చేయి లేదా కాలు కోల్పోవడంజరిగితే అతనికి 37,500 రూపాయలు లభిస్తాయి. ఈ బీమా పథకం కింద చేరిన తర్వాత పిల్లలకు స్కాలర్‌షిప్ కూడా లభిస్తుంది. ఇది అదనపు సేవల కిందికి వస్తాయి. దీని కింద చేరిన వారి ఇద్దరు పిల్లలు 9-12 తరగతుల్లో చదివేటప్పుడు ప్రతి నెలా 100-100 రూపాయలు లభిస్తాయి. ఆరు నెలలకు ఒకసారి జులై, జనవరి మొదటి తేదీల్లో నాలుగు సంవత్సరాల పాటు జమ అవుతాయి.

ఈ పథకం కింద కుటుంబంలోని ఒక సభ్యుడిని మాత్రమే భీమా లభిస్తుంది. బీమా చేసిన వ్యక్తి వయస్సు 18-59 ఏళ్ల మధ్య ఉండాలి. కుటుంబం దారిద్య్రరేఖకు దిగువన ఉండటం ముఖ్యం. బీమా చేసినవారికి ఏదైనా జరిగితే అప్పుడు డబ్బు నెఫ్ట్ లేదా లబ్ధిదారుని/నామినీ ఖాతాలో జమ అవుతుంది. దీని వార్షిక ప్రీమియం కేవలం రూ.200 ఇందులో ప్రభుత్వం రూ.100 జమ చేస్తే, బీమా చేసిన వ్యక్తి రూ.100  జమ చేయాల్సి ఉంటుంది. బీమా చేసిన వ్యక్తి గ్రామీణ ప్రాంతానికి చెందినవాడై ఉండాలి. ఇది దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారికి మాత్రమే వర్తిస్తుంది. అలాగే బీడీ కార్మికులు, వడ్రంగి, మత్స్యకారులు, హస్తకళల వంటి 24 రకాల వృత్తుల వారికి వర్తిస్తుంది.

చదవండి:

ఏప్రిల్ 1 నుంచి ఐటీలో ఐదు కొత్త నిబంధనలు

2 నిమిషాల్లో పాన్-ఆధార్ అనుసంధానం

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top