వైరల్‌ వీడియో: డప్పు చప్పుళ్లకు హుషారైన స్టెప్పులు.. కర్రలతో ‘ఫైటింగ్‌’

Latth Maar Diwali Celebrates In Uttar Pradesh - Sakshi

లక్నో: సాధారణంగా దీపావళి రోజు ఒక్కొ  ప్రాంతంలో.. ఒక్కొ ఆచారం ఉంటుంది. దీపావళిని  కొందరు బందీఛోడ్‌ దివస్‌గా నిర్వహించుకుంటే.. మరో చోట లాత్‌మార్‌ దీపావళిగా జరుపుకుంటారు. ఉత్తర ప్రదేశ్‌లోని జలౌన్‌ గ్రామస్తులు..ప్రతి ఏడాది లాత్‌మార్‌ దీపావళిని వేడుకగా జరుపుకుంటారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌​ గా మారింది.  దీనిలో వందల సంఖ్యలో గ్రామస్తులు ఒకచోట చేరారు.

ఆ తర్వాత..  రెండు గ్రూపులుగా విడిపోయి పెద్ద ఎత్తున డప్పులకు తగ్గట్టుగా హుషారుగా స్టెప్పులేశారు. ఈ క్రమంలో.. కర్రలతో ఒకరిపై ,మరోకరు దాడి చేసుకుంటున్నారు. దీంట్లో పాల్గోన్న వారు.. 30 నుంచి 40 ఏళ్ల వయసు వారున్నారు. ఈ వేడుకలో కొందరు పాల్గొంటే..  మరి కొందరు పక్కన నిలబడి ఆసక్తిగా చూస్తున్నారు. అయితే , ఈ లాత్‌మార్‌ దీపావళి మేము అనాదిగా ఆచరిస్తున్నామని జలౌన్‌ గ్రామస్తులు తెలిపారు. ఇది..  బుందేల్‌ ఖండ్‌ నుంచి  వచ్చిందని  తెలిపారు. అయితే, ఈ వీడియోలో గ్రామస్తులు .. కొవిడ్‌ నిబంధనలు పాటించలేదు. 

చదవండి: మరిది పెళ్లి... డ్యాన్స్‌తో రచ్చచేసిన వదిన.. వైరల్‌ వీడియో

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top