కరోనాతో చనిపోతే లోక్‌సభను మూసేయాలా?  | KS Eshwarappa Controversial Comments In Review Meeting In Bengaluru | Sakshi
Sakshi News home page

 కరోనాతో చనిపోతే లోక్‌సభను మూసేయాలా? 

Oct 10 2020 8:10 AM | Updated on Oct 10 2020 8:15 AM

KS Eshwarappa Controversial Comments In Review Meeting In Bengaluru - Sakshi

బెంగళూరు: కరోనా వల్ల కొందరు కేంద్ర మంత్రులు, ఎంపీలు మరణించారు.. అంతమాత్రాన లోక్‌సభను మూసివేయాలంటారా? అంటూ కర్ణాటక గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి కెఏస్‌.ఈశ్వరప్ప వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులోని ఓ స్టార్‌ హోటల్‌లో మంత్రి గ్రామీణాభివృద్ధి శాఖతో సమావేశమయ్యారు. ఈ సందర్భంంగా ఆయన మాట్లాడూతూ... రైతులు కూడా కోవిడ్‌ వల్ల చనిపోయారు.. అలా అయితే వ్యవసాయం బంద్‌ చేయాలా?’ అని వ్యాఖ్యానించారు. కరోనా వచ్చినంత మాత్రాన అన్నింటినీ నిలిపివేయడం సాధ్యం కాదన్నారు. కాబట్టి తాము అమలు చేయబోయే పథకాలను కూడా నిలిపివేయలేమని చెప్పారు. అనంతరం అన్నివర్గాలతో చర్చించి పాఠశాలల పునః ప్రారంభంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement