ఢిల్లీ దిశగా రైతుల పాదయాత్ర | Khanauri Border Sealed as Farmers Begin 228-Km March Towards Delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీ దిశగా రైతుల పాదయాత్ర

Aug 17 2026 4:14 AM | Updated on Aug 17 2026 4:14 AM

Khanauri Border Sealed as Farmers Begin 228-Km March Towards Delhi

అడ్డుకున్న హరియాణా పోలీసులు 

ఖనౌరీ బోర్డర్‌ పాయింట్‌ మూసివేత

ఖనౌరీ/జింద్‌: భారత్‌–అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కేఎం) చేపట్టిన పాదయాత్రను ఆదివారం హరియాణా పోలీసులు అడ్డుకున్నారు. హరియాణా–పంజాబ్‌ సరిహద్దుల్లోని దాటా సింగ్‌వాలా గ్రామం నుంచి ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వరకు ఈ యాత్రను ఎస్‌కేఎం తలపెట్టింది. ఆదివారం ఖనౌరీ అంతర్రాష్ట్ర పోస్ట్‌ వద్దకు 250 మంది రైతుల పాదయాత్ర బృందం రాగానే హరియాణా పోలీసులు అడ్డుకున్నారు.

 భారత్‌–అమెరికా ఒప్పందంతోపాటు పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంపై కేంద్ర మంత్రితోనే తాము చర్చలు జరుపుతామని పట్టుబట్టారు. తమ డిమాండ్‌కు అంగీకరించే వరకు ఖనౌరీలోనే బైటాయిస్తామంటూ ప్రకటించారు. దీంతో, సరిహద్దు పాయింట్‌ను అధికారులు మూసివేసి, వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించారు. కాంక్రీట్‌ బారికేడ్లను, ముళ్లకంచెను ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించారు. నిషేధాజ్ఞలను అమలు చేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement