కేదార్‌నాథ్‌ బీజేపీ ఎమ్మెల్యే శైలా రాణి మృతి | Kedarnath MLA Shaila Rani Rawat Dies At 68 | Sakshi
Sakshi News home page

Kedarnath MLA: కేదార్‌నాథ్‌ బీజేపీ ఎమ్మెల్యే శైలా రాణి మృతి

Jul 10 2024 12:26 PM | Updated on Jul 10 2024 1:20 PM

Kedarnath MLA Shaila Rani Rawat Dies At 68

ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్ బీజేపీ ఎమ్మెల్యే శైలా రాణి రావత్ మ‌ర‌ణించారు. డెహ్రాడూన్‌లోని మ్యాక్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె వయసు 68 ఏళ్లు. వెన్నెముక గాయం కారణంగా ఇటీవలే ఆసుపత్రిలో చేరిన ఆమెకు వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. అయితే ఆరోగ్యం క్షీణించడంతో ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

కాగా శైలారాణి రావత్.. 2012లో కాంగ్రెస్ టికెట్‌పై తొలిసారిగా కేదార్‌నాథ్‌ స్థానం నుంచి ఉత్తరాఖండ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అయితే, 2016లో ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్‌పై 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. వారిలో ఆమె కూడా ఉన్నారు. ఆ తర్వాత 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. 2022లో బీజేపీ త‌ర‌పున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

 

Advertisement
 
Advertisement
Advertisement