
హుబ్బళ్లి: మూడు దశాబ్దాల క్రితం నాటి రామాలయ ఉద్యమ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న హిందూ కార్యకర్త శ్రీకాంత్ పూజారి శనివారం బెయిల్‌పై విడుదలయ్యాడు. పెండింగ్ కేసులను పరిష్కరిస్తున్న క్రమంలో 2023 డిసెంబర్‌లో పూజారి కేసు బయటకు వచి్చంది. 1992లో రామాలయం ఉద్యమంలో పాలుపంచుకున్న అతడిపై అక్రమ మద్యం విక్రయం తదితర 16 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు.
రెండు పోలీస్ స్టేషన్లలో అతడిపై రౌడీషీట్ కూడా ఉంది. పోలీసులు తనను మార్కెట్‌కు వెళదామంటూ తీసుకొచి్చ, కటకటాల వెనుక పడేసినట్లు పూజారి ఆరోపించాడు. తనపై ఎటువంటి కేసులు లేవన్నాడు. బెయిల్‌పై తన విడుదలకు సహకరించిన హిందూ సంస్థలకు రుణపడి ఉంటానని అన్నాడు. రామాలయం కోసం పోరాడిన తను తిరిగి అయోధ్యకే వెళతానని చెప్పాడు.