కర్ణాటకలో ఏడు ఏవై.4.2 కరోనా కేసులు

Karnataka reports 7 cases of Delta Plus variant of coronavirus - Sakshi

బెంగుళూరు:  కరోనాలో కొత్త రకం ఏవై.4.2 కేసుల సంఖ్య కర్ణాటకలో ఏడుకి చేరుకుంది. డెల్టా ప్లస్‌ నుంచి రూపాంతరం చెంది కొత్తగా పుట్టుకొచ్చిన ఈ కొత్త రకం కేసులు మొట్టమొదటి సారిగా యూకేలో వెలుగులోకి వచ్చాయి. భారత్‌లోనూ ఈ కొత్త వేరియెంట్‌ కేసులు బయటపడ్డాయి. కర్ణాటకలో ఇప్పటిదాకా ఏడు కేసులు నమోదైనట్టుగా రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ రణ్‌దీప్‌ వెల్లడించారు. ఈ కొత్త వేరియెంట్‌తో ఎలాంటి మరణాలు సంభవించలేదని, కొంతమంది ఆస్పత్రి పాలయ్యారని తెలిపారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top