ఓటర్లకు జార్ఖండ్ సీఎం విజ్ఞప్తి | Jharkhand CM cast his vote, I appeal to everyone to vote | Sakshi
Sakshi News home page

ఓటర్లకు జార్ఖండ్ సీఎం విజ్ఞప్తి

May 13 2024 12:02 PM | Updated on May 13 2024 12:19 PM

Jharkhand CM cast his vote, I appeal to everyone to vote

రాంచి (జార్ఖండ్): లోక్‌సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్‌ వివిధ రాష్ట్రాల్లో చరుగ్గా సాగుతోంది. జార్ఖండ్ ముఖ్యమంత్రి చంపయి సోరెన్ సరైకేలా ఖర్సవాన్ జిల్లా జిలింగోరాలోని పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

జిలింగ్‌గోరాలోని ఉత్క్రమిత్ మధ్య విద్యాలయలో 220 నంబర్‌ పోలింగ్‌ బూత్‌లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేసిన  సీఎం చంపయి సోరెన్‌.. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నానని ఏఎన్ఐతో అన్నారు.

తొమ్మిది రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 96 నియోజకవర్గాల్లో లోక్‌సభ ఎన్నికల నాలుగో దశకు పోలింగ్ జరుగుతుండగా, ఉదయం 9 గంటల వరకు మొత్తం 10.35 ఓటింగ్ శాతం నమోదైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement