JEE Mains: ముగిసిన ఫస్ట్‌ షిఫ్ట్‌.. 3 గంటలకు రెండో షిఫ్ట్‌

JEE Mains 2021 Exam March Session Begins On 20 July - Sakshi

దేశవ్యాప్తంగా 828 పరీక్ష కేంద్రాలు

సాక్షి, న్యూఢిల్లీ: ఐఐటీ, నిట్‌ తదితర విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్‌ ప్రవేశాలకు సంబంధించి నిర్వహించాల్సిన జేఈఈ మెయిన్స్‌ పరీక్ష మంగళవారం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా 7,09,519 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరి కోసం దేశవ్యాప్తంగా 828 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రానికి విద్యార్థులకు గంటన్నర ముందే అనుమతి ఇచ్చారు. రెండు షిఫ్ట్‌ల్లో పరీక్ష నిర్వహిస్తుండగా.. మొదటి షిఫ్ట్‌ ఉదయం 9-12 గంటల వరకు కాగా.. రెండో షిఫ్ట్‌ మధ్యాహ్నం 3-6 గంటల వరకు ఉండనుంది. ఈ క్రమంలో మొదటి షిఫ్ట్‌ పరీక్ష మధ్యాహ్నం 12 గంటలకు ముగిసింది. 

కరోనా ప్రభావం నేపథ్యంలో పరీక్ష నిర్వహిస్తుండటంతో అభ్యర్థులు ప్రత్యేక గైడ్​లైన్స్​తో పాటు డ్రెస్​కోడ్ పాటించాల్సిందిగా ఆదేశాలు అమల్లో ఉన్నాయి. అలాగే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్​టీఏ) నిర్వహించే ఈ పరీక్షకు నిబంధనలన్నీ తప్పక ఫాలో కావాలి. కరోనా వైరస్ నేపథ్యంలో పరీక్ష కేంద్రాలను 660 నుంచి 828కు పెంచింది ఎన్​టీఏ. అలాగే గతంలో 232 నగరాల్లో జరిగే ఈ పరీక్షలు ఈసారి 334 సిటీస్​లో జరగనున్నాయి. అలాగే ఎన్​టీఏ.. ప్రత్యేక మార్గదర్శకాలు, నిబంధనలు విధించింది.

కరోనా నేపథ్యంలో ప్రత్యేక నిబంధనలు
పరీక్షకు వచ్చే అభ్యర్థులంతా మాస్క్​లు ధరించడం తప్పనిసరి. ఇక పరీక్ష కేంద్రం వద్ద రిజిస్ట్రేషన్​ ప్రక్రియ మొత్తం కాంటాక్ట్​లెస్​గా ఉంటుంది. అభ్యర్థులు తప్పకుండా భౌతిక దూరం పాటించాలి. పరీక్ష కేంద్రంలో సీటింగ్‌ కూడాభౌతిక దూరం నిబంధన ప్రకారమే ఉంటుంది. పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులకు హ్యాండ్​ శానిటైజర్ అందిస్తారు. ఒక షిఫ్ట్​లో వాడిన కంప్యూటర్లను ఆ రోజు మరో షిఫ్ట్​కు వినియోగించరు. అలాగే కేంద్రాల వద్ద అభ్యర్థులు గుమికూడకుండా రిపోర్టింగ్ కోసం స్లాట్​లను కేటాయించారు. దాన్ని బట్టి ఎగ్జామ్ సెంటర్ల వద్దకు వెళ్లాలి

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top