Jammu: ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న ఆర్మీ | Infiltration Attempt Foiled by Indian Army | Sakshi
Sakshi News home page

ఒకరి కాల్చివేత..ముగ్గురి పరార్‌

Dec 23 2023 10:45 AM | Updated on Dec 23 2023 10:54 AM

Infiltration Attempt Foiled by Indian Army - Sakshi

జమ్మూ : అంతర్జాతీయ సరిహద్దు నుంచి దేశంలోకి చొరబడేందుకు  ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాన్ని భారత సైన్యం అడ్డుకుంది. భారీగా ఆయుధాలు ధరించిన నలుగురు  ఉగ్రవాదులు శుక్రవారం(డిసెంబర్‌ 22)  అర్ధరాత్రి జమ్మూలోని అక్నూర్‌ సెక్టార్‌ వద్ద సరిహద్దు దాటడానికి యత్నించారు. వీరిని గుర్తించిన సైనికులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఒక ఉగ్రవాది అక్కడికక్కడే మరణించాడు. మిగతా వారు వెనక్కి వెళ్లిపోయారు. 

అయితే చనిపోయిన ఉగ్రవాది మృతదేహాన్ని మిగిలిన ముగ్గురు తమ వెంటే వెనక్కి లాక్కెళ్లిపోయారని ఆర్మీ అధికారులు తెలిపారు. ‘ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని అడ్డుకున్నాం. నలుగురిలో ఒకరిని కాల్చి చంపాం. మిగిలిన ముగ్గురు చనిపోయిన ఉగ్రవాది మృతదేహాన్ని లాక్కెళ్లడాన్ని గమనించాం’అని ఆర్మీకి చెందిన వైట్‌నైట్‌​ కార్ప్స్‌ ఎక్స్‌(ట్విటర్‌)లో తెలిపింది. 

రాజౌరీ సెక్టార్‌లో గురువారం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో నలుగురు ఆర్మీ జవాన్లు మృతి చెందారు. కాల్పులు జరిపిన ఉగ్రవాదుల కోసం ఒక పక్క సైన్యం పెద్దఎత్తున గాలింపు చర్యలు చేపడుతుండగానే మరో నలుగురు సరిహద్దు దాటి దేశంలోకి చొరబాటుకు ప్రయత్నించడం గమనార్హం. 

ఇదీచదవండి..మగువలు మెచ్చిన చెప్పులు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement