24 గంటల్లో 48,661 పాజిటివ్‌ కేసులు | India Reports 48661 New Covid Cases | Sakshi
Sakshi News home page

కోవిడ్‌-19 : ఒక్కరోజులో 705 మంది మృతి

Jul 26 2020 10:32 AM | Updated on Jul 26 2020 12:08 PM

India Reports 48661 New Covid Cases - Sakshi

అత్యధికంగా నమోదైన కరోనా వైరస్‌ కేసులు

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కోవిడ్‌-19 పరీక్షల సంఖ్య పెంచడంతో అత్యధికంగా వైరస్‌ కేసులు వెలుగు చూస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో రికార్డు స్ధాయిలో 48,661 తాజా పాజిటివ్‌ కేసులు నమోదవగా 705 మంది మరణించారు. తాజా కేసులతో భారత్‌లో​ కరోనా కేసుల సంఖ్య 13,85,522కు చేరింది. ఇక కోవిడ్‌-19 నుంచి కోలుకుని 8,85,577 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 4,67,882 యాక్టివ్‌ కేసులున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. మహమ్మారి బారినపడి మరణించిన వారి సంఖ్య 32,063కి పెరిగింది.

జులై 23 నుంచి దేశవ్యాప్తంగా ప్రతిరోజూ 40,000కిపైగా పాజిటివ్‌ కేసులు వెలుగుచూస్తుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. మహారాష్ట్రలో అత్యధికంగా 1,40,000కిపైగా కరోనా కేసులతో పాటు 13,312 మరణాలు చోటుచేసుకున్నాయి. కోవిడ్‌-19 కేసులు పెరగడంతో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ నిబంధనలను కఠినతరం చేస్తుండగా, మరికొన్ని రాష్ట్రాల్లో ప్రధాన నగరాలు, కంటైన్మెంట్‌ జోన్లలో సంపూర్ణ లాక్‌డౌన్‌ను పాటిస్తున్నారు. అయితే యాక్టివ్‌ కేసుల కంటే కోలుకున్న రోగుల సంఖ్య రెట్టింపవడం ఊరట కలిగిస్తోంది. రికవరీ రేటు 63.91 శాతంగా ఉందని అధికారులు పేర్కొన్నారు. కాగా, శనివారం ఒక్కరోజే అత్యధికంగా 4,42,263 శాంపిల్స్‌ను పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) పేర్కొంది. ఈనెల 25 వరకూ మొత్తం 1,62,91,331 కరోనా పరీక్షలు నిర్వహించినట్టు వెల్లడించింది. చదవండి : అంబులెన్స్‌ డ్రైవర్‌ అరాచకం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement