Corona Cases in India for Last 24 Hrs: గత 24 గంటల్లో 93,337 కరోనా కేసులు - Sakshi
Sakshi News home page

గత 24 గంటల్లో 93,337 కరోనా కేసులు

Sep 19 2020 10:08 AM | Updated on Sep 19 2020 11:54 AM

India  Records 93,337 Covid 19 Cases  In The Last 24 Hours - Sakshi

న్యూఢిల్లీ : భార‌త్‌తో క‌రోనా విజృంభిస్తోంది.  గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో  93,337 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం బాధితుల‌సంఖ్య 53,08,015 చేరింది. అయితే రిక‌వ‌రీ రేటు సైతం భారీగానే న‌మోద‌వుతుంది.   గడిచిన  24 గంటల్లో 1247  మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య  85,619కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 42,08,432కు చేరుకోగా, యాక్టివ్‌ కేసుల సంఖ్య10,13,964గా ఉంది. దేశ వ్యాప్తంగా న‌మోదైన  మొత్తం క‌రోనా  కేసుల్లో యాక్టివ్‌ కేసులు 19.52 శాతం ఉన్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు 78.86 శాతానికి పెరగ్గా, మరణాల రేటు 1.62 శాతానికి పడిపోయిందని కేంద్రం తెలిపింది.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement