
కోవిడ్ బాధితుల్లో తాజాగా 1045 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 66,333 కు చేరింది.
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి భారత్‌పై పంజా విసురుతోంది. గడిచిన 24 గంటల్లో ఏకంగా 78,357 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 37,69,524 కు చేరింది. కోవిడ్ బాధితుల్లో తాజాగా 1045 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 66,333 కు చేరింది. కోవిడ్ రోగుల్లో ఇప్పటివరకు 29,01,909 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 8,01,282 యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. ఇక దేశవ్యాప్తంగా కరోనా బాధితుల రికవరీ రేటు 77.02 శాతంగా ఉందని తెలిపింది. అలాగే మరణాల రేటు 1.76 శాతంగా ఉందని వెల్లడించింది. కాగా, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 4.43 కోట్ల కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశామని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ప్రకటించింది.
(చదవండి: సినీ సెలబ్రిటీల గుట్టు బయటపెట్టిన అనికా!)