మరోసారి ఈ నగరాల్లో రాత్రి‌ కర్ఫ్యూ పొడిగింపు

Gujarat Government Extends Night Curfew In This 4 Cities Till February 28th - Sakshi

అహ్మదాబాద్‌: కోవిడ్‌ వ్యాక్సిన్‌తో కరోనా తోకముడుస్తున్నప్పటికి దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికీ కర్ఫ్యూ కొనసాగుతోంది. గతేడాది దీపావళి నుంచి గుజరాత్‌లోని కొన్ని మెట్రో నగరాల్లో నైట్‌ కర్య్ఫూను ఆ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తోన్న సంగతి తెలిసిందే. అహ్మదాబాద్‌, సూరత్‌, వడోదర, రాజ్‌కోట్‌ నగరాల్లో నిర్వహిస్తున్న ఈ కర్ఫ్యూను తాజాగా గుజరాత్‌ ప్రభుత్వం ఫిబ్రవరి 28 వరకు పొడిగించింది. ఈ నాలుగు మెట్రో నగరాల్లో ఇప్పటికే రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అమలవుతున్న రాత్రి‌ కర్య్ఫూ సమయాన్ని ఒక్క గంట తగ్గించి ఈ నెల చివరి వరకు పొడిగించింది. అంటే ఫిబ్రవరి 28 వరకు రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఈ నాలుగు నగరాల్లో నైట్‌ కర్య్ఫూ అమలు కానుంది.

దీంతో అక్కడ కర్య్ఫూ పొడిగించడం ఇది నాలుగవ సారి. ఇక గతేడాది నవంబర్, డిసెంబరు నెలల్లో ఈ నగరాల్లో కేసులు రోజుకు సగటున 1,500 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదు గాక..  ప్రస్తుతం అక్కడ రోజుకు అత్యథికంగా 250 కేసులు నమోదవుతున్నాయి. ఇక ఆదివారం ఒక్కరోజే కొత్తగా 247 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో అక్కడ యాక్టివ్‌ కేసుల సంఖ్య 2,65,244 గా ఉందని తాజాగా రాష్ట్ర ఆరోగ్య శాఖ సోమవారం హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది. ఇక అహ్మదాబాద్‌లో కరోనాతో ఓ వ్యక్తి మృతి చెందడంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 4,401కు చేరిందని ఆరోగ్య శాఖ వెల్లడిచింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top